కాకినాడ-యానాం మధ్య తీరం దాటనున్న తుఫాను: పెనుగాలులు, భారీ వర్షాలు
అమరావతి/కాకినాడ/విశాఖపట్నం: పెథాయ్ తుఫాను కాసేపట్లో కాకినాడ - యానం మధ్య తీరం దాటనుంది. పెథాయ్ తుఫాను కారణంగా తీర ప్రాంతాల్లో పెనుగాలులు వీస్తున్నాయి. చెట్లు నేలకు కూలాయి. విశాఖపట్నం, కాకినాడలలో తుఫాను బీభత్సం బాగా ఉంది. ఈ ప్రభావం మరో రెండు గంటల వరకు ఉండనుంది.
పెనుగాలులు విరుచుకుపడుతున్నాయి. తుఫాను ప్రభావం కారణంగా కోనసీమ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో మూడు అడుగులకు పైగా నీళ్లు రోడ్ల పైనే నిలిచాయి. పెథాయ్ తుఫాను కారణంగా పలు విమానాలు రద్దయిన విషయం తెలిసిందే. ప్రయాణీకులు విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తున్నారు. మంత్రులు కళా వెంకట్రావు, నారా లోకేష్‌లు ఆర్టీజీఎస్‌లో కూర్చొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పెథాయ్ తుఫాను పరిస్థితులను ఎప్పటికి అప్పుడు సమీక్షించాలని సీఎం చంద్రబాబు.. మంత్రులు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Recommended Video


పెథాయ్ తుఫాను మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో కాకినాడ తీర ప్రాంతంలో తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. పెథాయ్ తుఫాను కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఏపీలోని 350 గ్రామాలతో పాటు బెంగాల్‌లోని పలు గ్రామాలపై భారీగా ప్రభావం పడనుంది.
-
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications