అతి తీవ్ర తుఫానుగా మారిన వాయుగుండం: చెన్నై టు నెల్లూరు భారీ వర్షాలు!
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వార్ధా తుపాను తీరానికి దూసుకొస్తోంది. ఈ తుఫాను రేపు (సోమవారం) చెన్నై - శ్రీహరి కోటల మధ్య తీరం దాటే అవకాశం ఉంది.
విశాఖ: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వార్ధా తుపాను తీరానికి దూసుకొస్తోంది. ఈ తుఫాను రేపు (సోమవారం) చెన్నై - శ్రీహరి కోటల మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో నాలుగు గంటల్లో ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో 20 సెం.మీ.ల వర్షం పడనుంది.
గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. ప్రధానంగా గూడురు, నాయుడుపేట ప్రాంతాల్లో తుఫాను ప్రభావం ఉండనుంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా 11 మండలాల్లోని 20 గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. జిల్లాలో మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ ముత్యాల రాజు చెప్పారు.

కాగా, శనివారం పెను తుపానుగా మారిన వార్దా ఆదివారం బలహీనపడి అతి తీవ్ర తుపానుగా మారింది. ఇది సోమవారం సాయంత్రం తీరం దాటే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఇది చెన్నైకి 480 కి.మీ దూరంలో, నెల్లూరు తూర్పు ఆగ్నేయంగా 520 కి.మీ దూరంలో కేందీకృతమై ఉంది.
వార్దా గంటకు దాదాపు పదకొండు కి.మీ. వేగంతో పశ్చిమ దిశగా పయనిస్తోంది. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుపాను తీవ్రత దృష్ట్యా కోస్తాంధ్రతో పాటు తమిళనాడులోని అన్ని పోర్టుల్లోనూ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications