హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీలో బాగుంది: సైరస్ ప్రశంస, ఏదోరోజు ఒలింపిక్స్:కేసీఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో పారిశ్రామిక ముసాయిదా విధానం బాగుందని టాటా గ్రూప్ ఎండీ సైరస్ మిస్త్రీ కితాబిచ్చారు. ఆయన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి పైన వారు చర్చించారు.

ఈ సందర్భంగా సైరస్ మాట్లాడారు. రాష్ట్రంలో పారిశ్రామిక ముసాయిదా విధానం బాగుందన్నారు. తెలంగాణలో ఉచిత నిర్బంధ విద్య అమలు శిక్షణలో సహకరిస్తామని చెప్పారు. తక్కువ ఖర్చుతో సోలార్ యూనిట్ల స్థాపన ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాదు నగరాన్ని స్లమ్ ఫ్రీ సిటీగా మార్చాలనే యోచన చాలా మంచిదన్నారు.

Cyrus p Mistry praises Telangana CM

ఏదో ఒకరోజు ఒలింపిక్స్ నిర్వహిస్తాం: కేసీఆర్

తెలంగాణ రాష్ట్రం ఏదో ఒకరోజు ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తుందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. త్వరలో స్పోర్ట్స్ పాలసీపై సమావేశం అవుతామని చెప్పారు. హైదరాబాదు నగరం చుట్టుపక్కల స్పోర్ట్స్ సిటీని నిర్మిస్తామని ఆయన చెప్పారు. ఈ స్పోర్ట్స్ సిటీలో జాతీయ, అంతర్జాతీయ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఒలింపిక్స్‌కు కూడా ఏదో ఒకరోజు ఆతిథ్యమిస్తామన్నారు.

ప్రోత్సాహకాలు అందుకుంటున్న క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం ఐటీ మినహాయింపు ఇవ్వాలని కేసీఆర్ కోరారు. ఇందుకు సంబంధించి తాను కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారు. ఈ నెల 19వ తేదీన సమగ్ర సర్వేలో క్రీడాకారులు కూడా పాల్గొంటారని ఆయన చెప్పారు.

English summary
Tata group MD Cyrus p Mistry praises Telangana CM K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X