దగ్గుబాటి సంచలన నిర్ణయం - ఎన్నికల వేళ ఇలా..!!

దగ్గుబాటి వెంకటేశ్వర రావు సంచలన నిర్ణయం ప్రకటించారు. టీడీపీ..బీజేపీ..కాంగ్రెస్..వైసీపీతో కొనసాగిన నాలుగు దశాబ్దాల రాజకీయ రంగానికి గుడ్ బై చెప్పారు. తనతో పాటుగా తన కుమారుడు హితేష్ రాజకీయాలకు స్వస్తి చెబుతున్నట్లు అభిమానుల మధ్య వెల్లడించారు. పాత విభేదాలను దూరం పెట్టి చంద్రబాబు - దగ్గుబాటి సన్నిహితంగా ఉంటున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో అందరూ టీడీపీకి మద్దతుగా నిలుస్తారని భావిస్తున్న వేళ దగ్గుబాటి తన మనసులో మాట చెప్పుకొచ్చారు. పురందేశ్వరి మాత్రం బీజేపీలో కొనసాగనున్నారు. ఇప్పుడు ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ..దగ్గుబాటి నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది. రాజకీయాలకు గుడ్ బై చెబుతూనే దగ్గుబాటి చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు కారణమవుతున్నాయి.

టీడీపీలో కీలకంగా - చంద్రబాబుతో దూరంగా

టీడీపీలో కీలకంగా - చంద్రబాబుతో దూరంగా

ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు టీడీపీ ఆరంభం నుంచి కీలకంగా వ్యవహరించారు. అయిదు సార్లు ఎమ్మెల్యేగా.. లోక్ సభ, రాజ్యసభ సభ్యుడిగా పని చేసారు. 1991లో బాపట్ల నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. టీడీపీలో 1995 ఎపిసోడ్ లో చంద్రబాబు తో పాటుగా ఉన్న దగ్గుబాటి..ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో దూరం అయ్యారు. చంద్రబాబు - దగ్గుబాటి మధ్య ఆ సమయంలో పూడ్చలేని విధంగా గ్యాప్ వచ్చింది. దీంతో.. బీజేపీలో చేరిన దగ్గుబాటి ఆ తరువాత కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. వైఎస్సార్ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో కుమారుడుతో కలిసి వైసీపీలో చేరారు. 2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వ నిర్ణయాల పైన దగ్గుబాటి ఓపెన్ గానే విమర్శలు చేసారు.

2019లో పోటీ - ఇద్దరి మధ్య తగ్గిన గ్యాప్

2019లో పోటీ - ఇద్దరి మధ్య తగ్గిన గ్యాప్

వైసీపీ నుంచి దగ్గుబాటి 2019 ఎన్నికల్లో పర్చూరు నుంచి పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లోనే తన కుమారుడిని వైసీపీ నుంచి బరిలో దింపాలని ప్రయత్నించినా.. పౌరసత్వానికి సంబంధించిన వ్యవహారంతో సాధ్యపడలేదు. ఆ ఎన్నికల్లో ఓటమి తరువాత క్రమేణా పార్టీకి.. రాజకీయాలకు దగ్గుబాటి దూరమయ్యారు. గతంలో ఎన్న దూరం తగ్గేలా అటు చంద్రబాబు ఇటు దగ్గుబాటి నందమూరి కుటుంబంలో జరిగిన కార్యక్రమాల్లో కలిసి హాజరయ్యారు. దగ్గుబాటి ఆస్పత్రిలో ఉన్న సమయంలో చంద్రబాబు వెళ్లి పరామర్శించారు. పురందేశ్వరి కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా పని చేసినా.. రాష్ట్ర విభజన తరువాత బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పురందేశ్వరి మరోసారి బీజేపీ ఎంపీగా పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నారు. తాజాగా వైసీపీ పర్చూరు బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే ఆమంచి క్రిష్ణమోహన్ ను అప్పగించారు. ఇప్పుడు దగ్గుబాటి తన నిర్ణయం ప్రకటించారు.

రాజకీయాలకు గుడ్ బై ..ఇమడలేను

రాజకీయాలకు గుడ్ బై ..ఇమడలేను

బాపట్ల జిల్లా ఇంకొల్లులో జరుగుతున్న ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న దగ్గుబాటి రాజకీయాలకు గుడ్ బై చెబుతూ ప్రకటన చేసారు. డబ్బుతో కూడిన రాజకీయాలతో విసుగు చెందామని.. తమ కుటుంబాలో తాను..తమ కుమారుడు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. గతానికి, ప్రస్తుతం ఉన్న రాజకీయాలకు పోలికలేదన్నారు. ఇప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు లేవని దగ్గుబాటి ఆవేదన వ్యక్తం చేసారు. లేచిన దగ్గర నుంచి నిత్యం డబ్బుతో నడిచే రాజకీయాలు తాను మనసు చంపుకొని చేయలేనని చెప్పారు. ప్రజాసేవ చేయాలనుకుంటే ఎటువంటి పదవులు లేకపోయినా తనకు అవకాశం ఉన్న మేరకు సొంతంగా చేస్తానని చెప్పుకొచ్చారు. దగ్గుబాటి ప్రకటన ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు కారణమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+