వారితో మాకేంటి: దామోదర, టిఎస్సార్‌కు నగర సభ్యులు

హైదరాబాద్: సీమాంధ్ర నేతలతో తమకేం సంబంధమని, రాజ్యసభ ఎన్నికలలో తమ ఓట్లను తెలంగాణ ప్రాంత అభ్యర్థులకే వేసుకుంటామని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం అన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో తమ ఐక్యతను నిరూపించుకుంటామని చెప్పారు. తెలంగాణ ఓట్లు తెలంగాణ అభ్యర్థికేనని, సీమాంధ్ర వారితో తమకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు.

damodara rajanarasimha

మాట్లాడా: కెకె

తనకు ఓటు వేయాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ శాసన సభ్యులను తాను కోరానని తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ అభ్యర్థి కె కేశవ రావు తెలిపారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వారు తనతో చెప్పారని తెలిపారు.

మరోవైపు తాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థికే ఓటు వేస్తానని రెబల్ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య చెప్పారు. లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు, కూకట్ పల్లి శాసన సభ్యులు జయప్రకాశ్ నారాయణ కూడా టిడిపి అభ్యర్థులకే ఓటు వేయనున్నారు. సిపిఐ అభ్యర్థులు కెకెకు ఓటు వేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ ఏజెంట్‌ను తప్పించాలంటూ రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజా సదారాంను కెకె కోరారు. ఎవరికి ఓటేశారో నోట్ చేసుకోవాలి తప్ప టిడిపి ఏజెంట్ అందరికీ చెబుతున్నారని ఫిర్యాదు చేశారు. అంతకుముందు గంగుల కమలాకర్, హన్మంతు షిండే, హరీశ్వర్ రెడ్డి రాజ్యసభ ఎన్నికల్లో కెకెకు ఓట్లు వేశారు. వారి ఓటును పోలింగ్ ఏజెంటుకే కాక అందరికీ చూపించారు. ఎమ్మెల్యేల వైఖరిపై టిడిపి ఏజెంటు అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాదు ఎమ్మెల్యేల ఓట్లను కొన్ని సీమాంధ్ర అభ్యర్థులకు కాంగ్రెసు కేటాయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+