రాజకీయం: నాడు ఎన్టీఆర్ కోసం, నేడు పవన్ కళ్యాణ్ కోసం దాసరి ప్లాన్!

అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ మైలేజీ కోసం దర్శకరత్న దాసరి నారాయణ రావు సినిమాను ప్లాన్ చేస్తున్నారా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో నందమూరి తారక రామారావు రాజకీయ మైలేజీ కోసం ఆయన హీరోగా దాసరి తీసిన సినిమాలు ఉపయోగపడ్డాయి.

సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి వంటి సినిమాలు రాజకీయ నేపథ్యంతో ఎన్టీఆర్‌తో తీశారు. ఈ రెండు సినిమాలు ఘన విజయం సాధించాయి. అలాగే, ఇవి నాడు ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశానికి తమ వంతు మైలేజీని అందించాయని అంటారు. ఆనాడు ఎన్టీఆర్‌కు రాజకీయ మైలేజీ సాధించి పెట్టిన దాసరి ఇప్పుడు పవన్ విషయంలోను అదే దారిలో నడవనున్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి.

Pawan Kalyan

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. అలాంటి పవన్‌కు మరింత రాజకీయ మైలేజీ తెచ్చేలా దాసరి సినిమా పరంగా ప్రణాళికలు రూపొందించారని అంటున్నారు. అందులో భాగంగా 'బోస్' సినిమాను పవన్ హీరోగా రూపొందించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

కాగా, దాసరి నారాయణ రావుకు మెగా సోదరుడు చిరంజీవితో విభేదాలు ఉన్నాయనే వాదనలు ఉన్న విషయం తెలిసిందే. అంతేకాదు, దాసరి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులుగా పని చేశారు. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని కపపడం, ఆ తర్వాత రాజ్యసభ సభ్యులు కావడంతో.. దాసరి కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. అయితే, పవన్ కళ్యాణ్ పైన ఆయన ఎప్పటికప్పుడు ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+