వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డేటా వార్ పై న్యాయ చర్యలు .. ఏపీ క్యాబినెట్ భేటీలో నిర్ణయం

|
Google Oneindia TeluguNews

అమరావతి : ఐటీ గ్రిడ్ డేటా అంశం తెలుగు రాష్ట్రాల్లో అగ్గిరాజేసింది. ఏపీ ప్రజల డేటాను ఐటీ గ్రిడ్ దుర్వినియోగం చేస్తోందని లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదుతో మొదలైన ప్రకంపనాలు పీక్ స్టేజీకి చేరాయి. ఏపీ సీఎం చంద్రబాబు రంగంలోకి దిగడంతో .. ఇటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. డేటా లీకేజీపై పోలీసులు విచారణ జరుపుతున్నారని భయమెందుకని అనడంతో మాటల యుద్ధం మరింత ముదిరింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఏపీ క్యాబినెట్ సమావేశమై చర్చించింది.

న్యాయ చర్యలు తీసుకుంటాం ?

న్యాయ చర్యలు తీసుకుంటాం ?

అమరావతిలో అందుబాటులో ఉన్న మంత్రులతో ఏపీ క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ప్రధానం ఐటీ గ్రిడ్ డాటా ఇష్యూపైనే ప్రధాన చర్చ జరిగింది. ఈ అంశంలో తెలంగాణ ప్రభుత్వం అతి చేస్తోందనే డిస్కషన్ వచ్చింది. ఈ అంశంపై మిన్నకుండిపోతే .. తప్పు జరిగిందనే భావన ప్రజల్లోకి వెళ్లిపోతుందని మంత్రివర్గం అభిప్రాయపడింది. అవసరమైతే న్యాయచర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టంచేసింది.

ఓట్ల తొలగింపుపై డిస్కషన్ ?

ఓట్ల తొలగింపుపై డిస్కషన్ ?

ఆంధ్రప్రదేశ్ లో నిబంధలను విరుద్ధంగా ఓట్లను తొలగిస్తున్నారని మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావన వచ్చింది. ఫారమ్ 7 ద్వారా వస్తున్న పిటిషన్లను నిశీతంగా పరిశీలించాలనే ఎన్నికల సంఘాన్ని కోరాలని నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఓట్లను తొలగిస్తున్నారని .. దీంతో టీడీపీ నష్టం జరిగే ప్రమాదం ఉన్నదనే చర్చ జరిగింది.

<strong>కాంగ్రెస్ కు 10, డీఎంకే 20 .. తమిళనాడులో పొడిసిన పొత్తు</strong>కాంగ్రెస్ కు 10, డీఎంకే 20 .. తమిళనాడులో పొడిసిన పొత్తు

మంత్రులకు క్లాస్ ?

మంత్రులకు క్లాస్ ?

ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలతో ఇబ్బండి పడుతోన్న చంద్రబాబు .. క్యాబినెట్ భేటీలో సహచర మంత్రులపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఏపీ డేటా చోరికి సంబంధించి తెలంగాణలో కేసులు పెట్టి విచారిస్తుంటే స్పందించారా అని ఈ సందర్భంగా బాబు అన్నట్టు సమాచారం. జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు వేగంగా స్పందించకుంటే ఎలా అని మంత్రులకు చురకలంటించినట్టు తెలుస్తోంది.

English summary
ap cabinet discuss it grid data and vote list issue. telangana government behave condems ap cabinet and also go to court in this particular issue. finally cm chandra babu angry cabinet ministers. particular time they donot respond.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X