విశాఖలో బిజీ: సొమ్మసిల్లి పడిపోయిన మంత్రి దత్తాత్రేయ (పిక్చర్స్)

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ నగర పర్యటనకు విచ్చేసిన కేంద్ర మంత్రి దత్తాత్రేయ సొమ్మసిల్లి పడిపోయారు. తాను బసచేస్తున్న అతిథిగృహం నుంచి నేరుగా మల్కాపురం ఇఎస్‌ఐ ఆసుపత్రి సందర్శనకు వెళ్లిన దత్తాత్రేయ అల్పాహార తీసుకోలేదు.

ఇఎస్‌ఐ ఆసుపత్రి సందర్శన అనంతరం ఆయన ఒక్కసారిగా సొమ్మసిల్లిపోయారు. చక్కెర వ్యాధిగ్రస్తుడైన దత్తాత్రేయ ఒక్కసారిగా షుగర్‌లెవెల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురయ్యారు. దీనిపై బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర మంత్రి దత్తాత్రేయకు అల్పాహారం ఏర్పాటు చేయాల్సిందిగా తమకు ఎటువంటి సమాచారం లేదని ఇఎస్‌ఐ ఆసుపత్రి అధికారులు వివరణ ఇచ్చుకున్నారు. జరిగిన సంఘటనపై ప్రోటోకాల్ అధికారుల మధ్య సమన్వయం కొరవడటంతోనే ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం.

బిజీగా దత్తాత్రేయ

బిజీగా దత్తాత్రేయ

కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం విశాఖపట్నంలో విజీగా గడిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

వినతిపత్రం...

వినతిపత్రం...

ఆల్ ట్రేడ్ యూనియన్ నాయకులు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు వినతి పత్రం సమర్పించారు.

భోజనం ఇలా...

భోజనం ఇలా...

కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తన విశాఖపట్నం పర్యటనలో ఇలా భోజనం చేశారు.

ఈఎస్ఐ ఆస్పత్రిలో ఇలా..

ఈఎస్ఐ ఆస్పత్రిలో ఇలా..

అల్పాహారం తీసుకోకపోవడం షుగర్ లెవెల్స్ పెరిగి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సొమ్మసిల్లి పడిపోయారు

బండారు దత్తాత్రేయ ఇలా..

బండారు దత్తాత్రేయ ఇలా..

మంత్రి బండారు దత్తాత్రేయ అల్పాహారం తీసుకోలేదనే విషయం తమకు తెలియదని ఈఎస్ఐ అధికారులు వివరణ ఇచ్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+