తల్లితో వివాహేతర సంబంధం: వ్యక్తి మర్మాంగాలను కోసిన కుమార్తె; తెనాలిలో ఘటన

వివాహేతర సంబంధాలు వ్యక్తుల ప్రాణాలు తీసే దాకా వెళ్తున్నాయి. చాలా వరకు వివాహేతర సంబంధాల వల్లే దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడ వివాహితల హత్యలు, భర్తల హత్యలు జరిగినా దాదాపు వివాహేతర సంబంధాలే కారణాలుగా కనిపిస్తున్నాయి.

ఇక తాజాగా గుంటూరు జిల్లా తెనాలిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తి మర్మాంగాలను కోసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తిపై ఆగ్రహంతో ఉన్న కూతురు అతని మర్మాంగాలను కోసిన ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

daughter cut private parts of a man who has committed an extramarital affair with his mother

బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం తుమ్మలపాలెం గ్రామానికి చెందిన ఎస్ రామచంద్ర రెడ్డి అనే వ్యక్తి రెండేళ్ల క్రితం తెనాలికి వచ్చి జీవనం సాగిస్తున్నారు. అతనికి ఐతానగర్ కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆమెతో కొంత కాలంగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ లాడ్జిలో నివాసముంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రామచంద్రారెడ్డి సోమవారం రాత్రి సదరు మహిళ ఇంటికి వెళ్లి, ఆమెతో కలిసి మద్యం సేవించి, ఆపై ఆమె నివాసం ఉండే భవనంపై నిద్రిస్తున్న క్రమంలో, దళిత వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిపై ఆగ్రహంగా ఉన్న కూతురు రామచంద్రారెడ్డితో గొడవకు దిగింది. తన తల్లితో అతను కలిసి ఉండటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.

తన ప్రియుడు సహకారంతో రామచంద్రారెడ్డి మర్మాంగాలను బ్లేడుతో కోసేసింది. బాధితుడు అరుపులు కేకలు విన్న స్థానికులు ఏం జరిగిందని వచ్చి చూసేసరికి తీవ్రగాయాలతో రామచంద్రారెడ్డి హాహాకారాలు చేస్తున్నాడు. స్థానికులు అతనిని తెనాలి జిల్లా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం, మెరుగైన చికిత్స కోసం గుంటూరు జిజిహెచ్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. తెనాలి టూ టౌన్ సిఐ కోటేశ్వరావు ఆసుపత్రికి వచ్చి బాధితుల నుంచి వివరాలు సేకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+