ప్రియుడితో కలిసి తల్లిని చంపిన తనయ.. కొడుకుని వదిలేసి పరారీ, పొన్నూరులో దారుణం!
సమాజంలో జరుగుతున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు. మానవత్వం మరచి, రక్త సంబంధాలకు తిలోదకాలిచ్చి, తల్లి తండ్రి, కొడుకు, కూతురు, అక్కా, చెల్లె అన్న అనుబంధాలను మరచి జరుగుతున్న దారుణ ఘటనలు మన సభ్య సమాజాన్ని సిగ్గుతో తల దించుకునేలా చేస్తున్నాయి. తాజాగా అటువంటి దారుణ ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
గుంటూరు జిల్లా పొన్నూరులో సమాజం నివ్వెరపోయే షాకింగ్ ఘటన జరిగింది. ప్రియుడితో సంబంధానికి అడ్డుగా ఉందని కన్నతల్లిని కూతురే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.పొన్నూరుకు చెందిన 45 ఏళ్ళ ఈవూరు లక్ష్మి పుష్పలత అనే కుమార్తె ఉంది. పుష్పలత భర్త మరణించిన తర్వాత కుమారుడితో కలిసి పుట్టింటికి వచ్చి ఆమె తల్లితో నివసిస్తోంది.

ఈ క్రమంలో పుష్పలత విజయవాడకు చెందిన రాజా అనే యువకుడితో సంబంధం ఏర్పరచుకుంది. ఆ యువకుడిని తరచూ కలుస్తూ ఉండటంతో తల్లి కూతురిని అనేకమార్లు హెచ్చరించింది. అలా చేయటం తప్పని పలుమార్లు హితవు పలికింది. తప్పుడు సంబంధాలు వద్దని, ఒకవేళ ఒంటరిగా జీవించటం ఇష్టం లేకపోతే మళ్లీ పెళ్లి చేసుకుని స్థిరపడాలని సలహా ఇచ్చింది. అయినా కూతురు మారలేదు.
తమ సంబంధానికి తల్లి అడ్డుగా ఉందని భావించిన పుష్పలత, ప్రియుడు రాజాతో కలిసి తల్లిని హత్య చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. తల్లి మెడకు చీరలతో ఉరి బిగించి తల్లిని ప్రియుడితో కలిసి హతమార్చి, హత్య తర్వాత ఇంట్లోని బంగారం, నగదు తీసుకుని ఇద్దరూ పరారయ్యారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు స్పందించి హత్య కేసు నమోదు చేశారు.
దర్యాప్తులో పుష్పలత కుమారుడు కీలక వాంగ్మూలం ఇచ్చాడు. తన తల్లి, రాజా కలిసి అమ్మమ్మను చంపారని, ఆ తర్వాత నగలు, నగదుతో పారిపోయారని చెప్పాడు. ప్రస్తుతం నిందితులను పోలీసులు వెతుకుతున్నారు. వివాహేతర సంబంధాలు మంచివి కాదని, అలా చెయ్యొద్దని ఆంక్షలు పెట్టిందని తల్లి అన్నది కూడా చూడకుండా ఆ కూతురు కిరాతకంగా తల్లిని హతమార్చింది. కన్నా కొడుకుని కూడా వదిలేసి ప్రియుడితో కలిసి వెళ్ళిపోయింది. ఈ ఘటనలో అభం శుభం తెలియని బాలుడు అనాథగా మిగిలిపోయాడు.












Click it and Unblock the Notifications
