సినిమా స్టార్ల కంటే జగన్ దగ్గర లక్ష రెట్ల డబ్బులు ఎక్కువగా ఉంది, పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి మూడు నెలలు కాకుండానే ఆ రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల వలన విజయవాడ నగరం అతలాకుతలమైంది. కృష్ణమ్మ ఫోటెత్తడంతో విజయవాడ నగరాన్ని, పరిసర ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఎన్టీఆర్ జిల్లాలో వరదల దెబ్బకి భారీ నష్టం జరిగిందని, విజయవాడ ప్రజలు తీవ్రస్థాయిలో నష్టపోయారని ప్రభుత్వం అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదే సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు వరద బాధిత ప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తినా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. విజయవాడలోనే రాజరాజేశ్వరి పేటలో బుధవారం పర్యటించిన మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా వరద బాధితులతో మాట్లాడిన తరువాత సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

సీఎం చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో జేసీబీలు, ట్రాక్టర్లలో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అయితే వైసీపీ నాయకులు మాత్రం సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ కల్యాణ్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించకుండా ఇంటికి పరిమితమైనారని చాలా మంది వైసీపీ నాయకులు ఆరోపించారు.
వరద సహాయక చర్యల్లో తాను పాల్గొంటే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు సూచించడం వలన తాను ఆ ప్రాంతాలకు వెళ్లలేదని ఇప్పటికే పవన్ కల్యాణ్ వైసీపీ నాయకులకు కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయ నిధికి కోటి రూపాయలు, తెలంగాణ సీఎం సహాయ నిధికి కోటి రూపాయలు తన డబ్బులు అందిస్తానని పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ లోని 400 గ్రామాలకు నాలుగు కోట్లు రూపాయలు తన సొంత నిధులను విడుదల చేస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. అయినా వైసీపీ నాయకులు పవన్ కల్యాణ్ టార్గెట్ చేయడంతో ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సినిమా నటుల దగ్గర కంటే వైయస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు డబ్బులు ఉంటుందని, వరద బాధితులను ఆదుకోవడానికి ఆయన ఎంత నిధులు ఇఛ్చారో అని వైసీపీ నాయకులు చెప్పాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
సినిమా నటీనటుల దగ్గర కంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి దగ్గర భారీ మొత్తంలో డబ్బులు ఉందని, మీ నాయకుడు సీఎం సహాయ నిధికి ఎన్ని కోట్లు డబ్బులు ఇచ్చారో చెప్పాలని వైసీపీ నాయకులను పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. మా ప్రభుత్వం మీద విమర్శలు మానుకొని వరద బాధితులు ఆదుకోవడానికి సహాయక కార్యక్రమాలలో వైసీపీ నాయకులు పాల్గొంటే మంచిదని, ఆ తర్వాత మమ్మల్ని విమర్శిస్తే బాగుంటుందని పవన్ కల్యాణ్ వైసీపీ నాయకులకు కౌంటర్ ఇచ్చారు. లక్షల కోట్ల వెనకేసుకున్న వైయస్ జగన్ ఎప్పుడూ ఎవరికి సహాయం చేయలేదని టీడీపీ, జనసేన నాయకులు సైతం వైసీపీ నాయకులు పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు,












Click it and Unblock the Notifications