వర్షాల మృతులు 53 మంది: రఘవీరా రెడ్డి వెల్లడి
హైదరాబాద్: తుఫాన్, వరదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 53 మంది మృతి చెందారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.1.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు. 18 ఏళ్లు పైబడినవారికి ఆపద్బందు కింద మరో రూ.50 వేలు ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు.
ఇప్పటివరకు రూ.3.5 వేల కోట్ల నష్టం వాటిల్లిందని రఘువీరారెడ్డి చెప్పారు. 667 మండలాల్లో 11.42 లక్షల హెక్టార్ల పంట నష్టం జరిగినట్లు గుర్తించామన్నారు. వర్షం కారణంగా 48,500 ఇళ్లు దెబ్బతిన్నాయని, వచ్చే రచ్చబండలోపు ఇళ్లు మంజూరుచేస్తామన్నారు.

పెండింగ్‌లో ఉన్న పెట్టుబడి రాయితీలను తక్షణం విడుదల చేయాలని ఆర్థికశాఖను కోరినట్లు మంత్రి రఘువీరారెడ్డి వివరించారు. బ్యాంకర్లతో మాట్లాడి రైతుల రుణాలు రీ షెడ్యూలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. జనజీవనం స్తంభించింది. పలు జిల్లాల్లో పంట నష్టం సంభవించింది. ఈ వర్షాలకు శ్రీకాకుళం జిల్లా ఎక్కువగా నష్టపోయింది.












Click it and Unblock the Notifications