ఏపీలో క్షీణిస్తున్న కరోనా కేసులు ..తాజాగా 2,224 కరోనా పాజిటివ్ కేసులు, 31 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు క్షీణిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో చూస్తే కొత్తగా 2,224 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లుగా వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. తాజాగా మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 18,82,096కి చేరుకుంది. ఇందులో 42,252 యాక్టివ్ కేసులున్నట్టు తెలుస్తుంది. గడచిన 24 గంటల్లో కరోనా మహమ్మారి బారినుండి మంది కోలుకున్నారు.
Recommended Video
ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడిన వారు మొత్తంగా 18,24 ,312 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో కరోనా నుండి 4,714 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. నేడు నమోదైన 31 మరణాలతో పాటు మొత్తం రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 12,630 కు చేరింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,18,04,691 శాంపిల్స్ ను పరీక్షించినట్లు గా అధికారికంగా వెల్లడించారు. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు చూస్తే

తూర్పుగోదావరి జిల్లాలో గత 24 గంటల్లో 299 కేసులు, అనంతపూర్ జిల్లాలో 66 కేసులు, చిత్తూరు జిల్లాలో 409 కేసులు, గుంటూరు జిల్లాలో 191 కేసులు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 173 కేసులు, కృష్ణాజిల్లాలో 222 కేసులు, నెల్లూరు జిల్లాలో 116 కేసులు, కర్నూలు జిల్లాలో 66 కేసులు, ప్రకాశం జిల్లాలో 157 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో 51 కేసులు, విశాఖపట్నంలో 122 కేసులు, విజయనగరంలో 93 కేసులు, వెస్ట్ గోదావరి లో 259 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా చూస్తే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 409 కేసులు, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 51 కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications