ఓటమి కొత్తకాదు: రఘువీరా, కుక్కలా ఉండమన్నారనీ..
హైదరాబాద్: తమ పార్టీకి ఓటమి కొత్తేమి కాదని ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర) పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తమను ఐదేళ్లపాటు రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉండమని ప్రజలు ఆదేశించారని చెప్పారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంపై ఆయన సమీక్షించారు.
తాము ప్రస్తుతం భవిష్యత్ కార్యాచరణపైనే దృష్టి సారిస్తున్నామని రఘువీరా రెడ్డి చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క అసెంబ్లీ స్థానం కూడా దక్కలేదు. ఒక్క పార్లమెంటు స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది.

తెలంగాణ పట్ల కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు: దత్తాత్రేయ
తెలంగాణ పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందిన బండారు దత్తాత్రేయ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందుకే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడించారన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయనున్నట్లు దత్తాత్రేయ తెలిపారు.
ఎమ్మెల్సీ పదవికి వీరభద్రస్వామి రాజీనామా
ఎమ్మెల్సీ పదవికి కొలగట్ల వీరభద్రస్వామి రాజీనామా చేశారు. వీరభద్రస్వామి తన రాజీనామా పత్రాన్ని ఛైర్మన్‌కు అందజేసినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications