వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ ప్రత్యర్థులకు బిగ్ షాక్: హైకోర్టులో ఆ పిటీషన్ కొట్టివేత: పార్టీ క్యాడర్‌లో జోష్

|
Google Oneindia TeluguNews

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలోొ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రత్యర్థులకు బిగ్ షాక్ తగిలింది. వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన పిటీషన్ కొట్టివేతకు గురైంది. ఈ పిటీషన్‌ అసంబద్ధమైనదిగా పేర్కొంది న్యాయస్థానం. దీన్ని కొట్టివేస్తున్నట్లు తెలిపింది. దీనితో అధికార పార్టీ నేతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. హైకోర్టు నిర్ణయాన్ని వారంతా స్వాగతిస్తోన్నారు.

Rohini Sindhuri: మరో వివాదంలో తెలుగు అధికారిణి: వేధింపులు..తోటి ఐఎఎస్ రిజైన్: ఆ ఆరోపణలుRohini Sindhuri: మరో వివాదంలో తెలుగు అధికారిణి: వేధింపులు..తోటి ఐఎఎస్ రిజైన్: ఆ ఆరోపణలు

రాష్ట్రంలో అధికారంలో ఉన్న యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP).. పేరు తమ పార్టీని పోలి ఉందంటూ 'అన్నా వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ భాషా ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కారణంతో వైఎస్సార్సీపీ గుర్తింపును రద్దు చేయాలని ఆయన తన పిటీషన్‌లో పేర్కొన్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో ఈ పిటీషన్ దాఖలైంది. ఏడాదికి పైగా విచారణ సాగింది. పలు ధఫాలుగా వాయిదా పడుతూ వచ్చింది ఈ పిటీషన్‌పై విచారణ.

 Delhi HC rejects petition seeking de-recognition of CM YS Jagans YSRCP

తాజాగా కొద్దిసేపటి కిందటే ఢిల్లీ హైకోర్టు తన తుది తీర్పు వెలువడించింది. ఈ పిటీషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ప్రతీక్ జలాన్ తీర్పు ఇచ్చారు. ఈ పిటీషన్ విచారణకు అర్హమైనది కాదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ పేరు వాడటానికి వీల్లేదని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించినప్పటికీ.. ఆ పార్టీ పట్టించుకోవట్లేదని, దాని గుర్తింపును రద్దుచేయాలంటూ బాషా పిటిషన్‌ వేశారు. వైసీపీని తమ అన్నా వైసీపీలో ఒక భాగంగా గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల గుర్తులు (రిజర్వేషన్ అండ్ అలాట్‌మెంట్)లోని పేరా 16ఏ కింద వైసీపీ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించిందని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ఎన్నికల గుర్తును రద్దు చేయడంతో పాటు ఆ పార్టీ పేరును మరొకరు వినియోగించుకోకుండా చర్యలు చేపట్టాలని మహబూబ్ భాషా తన పిటిషన్లో న్యాయస్థానానికి అభ్యర్థించారు. లెటర్ హెడ్లు, పోస్టర్లు, బ్యానర్లలో ఉపయోగించే పేరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

English summary
The Delhi High Court on Friday dismissed a petition seeking de-registration of Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy's YSR Congress Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X