వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ ఆ పని చెయ్యకుంటే ఇవే మా ఆఖరి ఓట్లు ... బ్యాలెట్ బాక్సుల్లో తాగుబోతుల లేఖ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మునిసిపల్ ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయాన్ని సాధించింది. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రత్యర్థి పార్టీలకు మరోమారు వైసిపి షాకిచ్చింది. కౌంటింగ్ మొదలు నుంచి చివరి వరకు అధికార వైసీపీ తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూనే వచ్చింది. ఈ ఎన్నికలలో సత్తా చాటాలని భావించిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగి ప్రచారం చేసినప్పటికీ ఫలితాలలో మాత్రం టిడిపి చతికిలబడింది.

 ఇదిలా ఉంటే ఎన్నికల ఓట్ల కౌంటింగ్ లో పలుచోట్ల ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి.

ఇదిలా ఉంటే ఎన్నికల ఓట్ల కౌంటింగ్ లో పలుచోట్ల ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి.

నంద్యాల మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపులో స్లిప్పులు చూసి షాక్ అయిన అధికారులు

రాజధాని అమరావతి ప్రాంతంలో జై అమరావతి అంటూ బ్యాలెట్ బాక్స్ లో స్లిప్పులు వేస్తే, విశాఖ నగరంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ స్లిప్పులు దర్శనమిచ్చాయి. ప్రాంతాల వారీగా అక్కడక్కడా ఇలాంటి స్లిప్పులు దర్శనమిస్తే కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు సమయంలో కూడా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపాలిటీ లో 29 వ వార్డులో ఓట్ల లెక్కింపు జరుగుతుండగా , బ్యాలెట్ బాక్స్ లలో వచ్చిన స్లిప్పులు అధికారులను ఒక్కసారి షాక్ కు గురి చేశాయి.

లిక్కర్ బ్రాండ్ లపై తాగుబోతుల డిమాండ్

లిక్కర్ బ్రాండ్ లపై తాగుబోతుల డిమాండ్


ఇక స్లిప్పులలో ఉన్న విషయం చదివిన అధికారులు ఆ ఆసక్తికర విన్నపంపై నవ్వుకున్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి నంద్యాల తాగుబోతుల విన్నపం అంటూ సాగిన ఆ లేఖలో లిక్కర్ బ్రాండ్స్ కోసం తమ విన్నపాన్ని తెలియజేశారు. కొత్త బ్రాండ్ లను తొలగించి పాత లిక్కర్ బ్రాండ్లను అమ్మాలని తమ విన్నపం అంటూ పేర్కొన్న నంద్యాల తాగుబోతులు లేకపోతే మా చివరి ఓటు ఇవే కాగలవని విన్నవించుకుంటున్నాము అంటూ విజ్ఞప్తితో కూడిన హెచ్చరికలు జారీ చేశారు.

 వైసీపీ హయాంలో విక్రయాల్లో కొత్త లిక్కర్ బ్రాండ్లు .. రుచించని మందుబాబులు

వైసీపీ హయాంలో విక్రయాల్లో కొత్త లిక్కర్ బ్రాండ్లు .. రుచించని మందుబాబులు

ఎవరైనా సహజంగా బ్యాలెట్ బాక్స్ లలో ఏవైనా స్లిప్పులు వేస్తే స్థానిక సమస్యల పైనో , ప్రభుత్వానికి తాము తమ ప్రాంత అభివృద్ధికి చెప్పదలుచుకున్న విషయాలనో తెలియజేస్తారు. అలా కాకుండా లిక్కర్ బ్రాండ్ కోసం తాగుబోతులు విజ్ఞప్తి చేయటం ఒకింత వింతగా , స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి మద్యనిషేధం కోసం అడుగులు వేస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది . అంతేకాక లిక్కర్ బ్రాండ్ లను మార్చేసి విక్రయాలు చేపట్టింది . ఈ లిక్కర్ బ్రాండ్లు రుచించని మందుబాబులు బ్రాండ్లను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు .

English summary
In the letter to AP CM Jagan Mohan Reddy, Nandyal drunkards, conveyed their plea for liquor brands. Nandyal, drunkards said their plea to remove the new brands and sell the old liquor brands and also gave warning to ys jagan if not changed the liquor brands it was the last voting of the drunkards .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X