కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విత్ డ్రాయల్ ప్రమాదం: రెండు కార్డులతో డబ్బులు తీశాడని చేయి విరగ్గొట్టాడు

పెద్ద నోట్ల రద్దు తీవ్ర పరిణామాలకు దారి తీస్తోంది. రెండు కార్డులతో ఎటిఎం కేంద్రంలో డబ్బులు తీశాడనే కారణంతో ఓ వ్యక్తిపై పోలీసులు దాడి చేశారు. దీంతో అతని చేయి విరిగింది. ఈ సంఘటన కర్నూలులో చోటు చేసుకుంది

By Pratap
|
Google Oneindia TeluguNews

కర్నూలు/ విశాఖపట్నం: ఎటిఎం కేంద్రాల వద్ద ప్రజల కష్టాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. ఏటీఎంలో రెండు కార్డులతో డబ్బు వితడ్రా చేశాడని ఓ ఖాతాదారుడిపై పోలీసు కానిస్టేబుల్‌ అత్యంత దారుణంగా వ్యవహరించాడు.

కర్నూలు జిల్లా చాగలమర్రిలో బుధవారం ఏటీఎం వద్ద క్యూలో నిలబడిన సుధాకర్‌ అనే వ్యక్తి తన వంతు రాగానే లోపలికి వెళ్లి రెండు కార్డులతో డబ్బులు తీశాడు. దీంతో అతడు బయటకు రాగానే అక్కడ విధుల్లో ఉన్న హెడ్‌కానిస్టేబుల్‌ రాజా హుసేన్‌ అడ్డుకున్నాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

హెడ్‌కానిస్టేబుల్‌ రాజా హుసేన్‌ సుధాకర్ చెయ్యి పట్టుకొని మెలితిప్పాడు. దీంతో సుధాకర్‌ చెయ్యి విరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం ఎస్పీకి చేరింది. దీంతో ఆయన వెంటనే హెడ్‌కానిస్టేబుల్‌ను వీఆర్‌కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు.

Demonetisation trouble: Police attack on a customer

ఇదిలావుంటే, నోట్ల రద్దు నేపథ్యంలోనిరుటితో పోలిస్తే ఈ సంవత్సరం 50శాతం అధికంగా పన్నులు వసూలు అయ్యాయని జీవీఎంసీ కమిషనర్ హరినారాయణ్ చెప్పారు. ట్యాక్స్ కలెక్షన్ సెంటర్లలో ఈపాస్ మిషెన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పెన్షన్ డబ్బు వారి వారి ఖాతాల్లోనే వేయనున్నట్లు పేర్కొన్నారు. జీవీఎంసీ పరిధిలో ఉన్న ఉద్యోగులకు జీతాలు, పెన్షన్‌దారులకు ఎలాంటి ఇబ్బంది లేదని మొదటి వారంలోనే చెల్లింపులు ఉంటాయని జీవీఎంసీ కమిషనర్ హరినారాయణ్ స్ఫష్టం చేశారు.

English summary
A head constable attacked a customer at ATM centre in kurnool district of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X