బాత్రూంలో సెల్ కెమెరా పెట్టి విద్యార్థినుల నగ్న వీడియోలు: టీచర్‌కి దేహశుద్ది, అరెస్ట్
Recommended Video

అనంతపురం: పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తూ ఓ గురువు తన వక్రబుద్ధితో కటకటాలపాలైన ఘటనం అనంతపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాప్తాడు మండలం బండమీదపల్లికి చెందిన సంజీవరాయుడు బీఈడీ వరకు చదువుకున్నాడు.
మూడేళ్ల కిందట అనంతపురం వచ్చిన సంజీవరాయుడు.. మారుతినగర్‌లో 'లోటస్ అకాడమీ కోచింగ్' ఏర్పాటు చేసి వివిధ పోటీ పరీక్షలతో పాటు పాలిసెట్, ఏపీఆర్‌జేసీ, టీటీసీ, మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాడు. సబ్జెక్టును బట్టి నెలకు రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నాడు.

హాస్టల్ ఏర్పాటు చేసి..
ఇల్లు, కోచింగ్ సెంటర్‌తోపాటు గ్రామీణ ప్రాంత విద్యార్థినుల కోసం హాస్టల్ కూడా ఒకే చోట నిర్వహిస్తున్నాడు సంజీవరాయుడు. ప్రస్తుతం అతని అకాడమీలో 75 మంది విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారు. వీరిలో ఎక్కువమంది అమ్మాయిలే ఉన్నారు. కాగా, విద్యార్థులను పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలన్న మంచి ఆలోచనతో అకాడమీ పెట్టిన సంజీవరాయుడి బుద్ధి వక్రమార్గంలో వెళ్లింది.

బాత్రూంలో సెల్‌ఫోన్ పెట్టి..
హాస్టల్‌లో ఉంటున్న అమ్మాయిలను నగ్న దృశ్యాలను చిత్రీకరించాలన్న దురాలోచన అతనిలో కలిగింది. ఈ క్రమంలో హాస్టల్‌లో విద్యార్థిను లందరికీ ఒకే బాత్‌రూం ఉండటంతో అవసరమైతే తన బాత్‌రూం కూడా వాడుకోవాలని శుక్రవారం ఉదయం చెప్పాడు. అయితే అప్పటికే తన బాత్‌రూంలో చెప్పుల బాక్సు (ఖాళీ అట్టపెట్టె) ఉంచి, దానికి రంధ్రం పెట్టి అక్కడ సెల్‌ఫోన్ వీడియో ఆన్ చేసి ఉంచాడు.

ఓ విద్యార్థినికి అనుమానం వచ్చి..
కాగా, స్నానానికి వెళ్లిన ఓ విద్యార్థిని ఆ అట్టపెట్టె అనుమానంగా కనిపించడంతో తెరిచి చూసింది. వీడియో రికార్డింగ్‌ను గుర్తించింది. జరిగిన విషయాన్ని తోటి విద్యార్థులకు తెలియజేసి, వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్న తల్లిదండ్రులు.. సంజీవరాయుడును చితకబాదారు.

నిందితుడి అరెస్ట్
లోటస్ అకాడమీ కోచింగ్ సెంటర్‌లోని ఫర్నీచర్, ఫ్లెక్సీబోర్డులను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న 4వ పట్టణ ఎస్‌ఐ శ్రీరామ్ శ్రీనివాస్ ఘటనాస్థలానికి చేరుకొని.. నిందితున్ని అరెస్ట్ చేశారు. బాధితుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని విద్యార్థినుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications