పవన్ కల్యాణ్ తగిన మూల్యాన్ని చెల్లించుక తప్పదా?
అమరావతి: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తామంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు. పవన్‌పై ఘాటు విమర్శలు చేశారు. అదే స్థాయిలో తీవ్ర ఆరోపణాస్త్రాలను సంధించారు.
తాను తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయాననే విషయాన్ని పవన్ కల్యాణ్ మరోసారి నిరూపించుకున్నాడని కొట్టు సత్యనారాయణ ధ్వజమెత్తారు. తాను ప్యాకేజీ స్టార్ అని అందరూ అంటోన్న విషయాన్ని నిజం చేశాడని ఆరోపించారు. పవన్ కల్యాణ్‌ను ప్రజల్లో ఎంతో చులకనగా చూసిన వ్యక్తి చంద్రబాబేనని, ఇప్పుడు ఆయన పంచనే చేరాడని విమర్శించారు.

డబ్బు, ప్యాకేజీ కోసం పని చేసే వ్యక్తిగా పవన్ కల్యాణ్‌ను చిత్రీకరించింది చంద్రబాబు కాదా..? అని కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. టీడీపీ-జనసేన పొత్తు విషయం ఏనాడో జరిగిపోయిందని, ఇప్పుడు దాన్ని పవన్ కల్యాణ్ బయటపెట్టుకున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. ముసుగును తొలగించి.. తన అసలు రూపాన్ని ప్రజల ముందు ఉంచాడని మండిపడ్డారు.
చంద్రబాబుతో కలసి వెళ్తాననంటున్న పవన్.. దీని పర్యవసానం ఏమిటో త్వరలోనే చూస్తారని కొట్టు సత్యనారాయణ హెచ్చరించారు. కాపు నాయకులు వంగవీటి రంగాను చంపింది చంద్రబాబు కాదా?, ముద్రగడ కుటుంబాన్ని అవమానించింది చంద్రబాబు కాదా?, చిరంజీవిని అవమానించింది చంద్రబాబు కాదా?, కాపులకు ఇంత ద్రోహం చేసిన వ్యక్తితో కలవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయం కాపులను తలదించుకునేలా చేసిందని కొట్టు సత్యనారాయణ అన్నారు. కాపు వ్యతిరేకి చంద్రబాబు మద్దతు ఇవ్వడం, తగిన మూల్యం నువ్వు చెల్లించుకోక తప్పదని అన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారని, పవన్ కల్యాణ్ ఉంటే షూటింగ్‌లో.. లేకపోతే చంద్రబాబు కాళ్ల దగ్గర ఉంటాడంటూ ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications