వైవీ సుబ్బారెడ్డి కాళ్లు మొక్కిన ఏపీ డిప్యూటీ సీఎం: వైసీపీ నేతలు షాక్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఎప్పుడు, ఎవరు ఎటువంటి పనులు చేస్తారో అర్థం కాని పరిస్థితి ఉంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి కాళ్లకు మొక్కి అందర్నీ ఒక్కసారిగా షాక్ కు గురి చేశారు. ఒక కార్యక్రమంలో ఆయన వైవీ సుబ్బారెడ్డి కాళ్ళు మొక్కారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైసీపీ నేతల్లో డిప్యూటీ సీఎం నారాయణస్వామి రూటే సపరేటు. సీఎం జగన్ పైన వీర విధేయతను ప్రదర్శిస్తూ, టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ఈ క్రమంలో ఆయన అనేక సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసి చర్చనీయాంశంగా మారారు.

ఇక తాజాగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధర నెల్లూరు పరిధిలోని పెనుమూరు మండలం లో నిర్మిస్తున్న టిటిడి కళ్యాణ మండపం భూమి పూజ కార్యక్రమంలో అందరూ అవాక్కయ్యే పని చేశారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఆర్ టీ సి వైస్ చైర్మన్ విజయానంద రెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వేదికపైనే వై వి సుబ్బారెడ్డి కాళ్లకు నారాయణస్వామి నమస్కారం చేసాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తరచూ స్వామి భక్తిని ప్రదర్శించే నారాయణస్వామి తన చర్మాన్ని ఒలిచి సీఎం జగన్మోహన్ రెడ్డికి చెప్పులు కుట్టిస్తా అంటూ వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.
అంతేకాదు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పైన తనదైన శైలిలో విమర్శలు గుప్పించడంలో ఆయన అందెవేసిన చేయి. ఇటీవల చంద్రబాబు గుర్తు ఏడుపు గుర్తని, జగన్ మోహన్ రెడ్డి గుర్తు చిరునవ్వు గుర్తని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చర్యలు, ఆయన వ్యాఖ్యలు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తాయి.












Click it and Unblock the Notifications