జగన్ దూకుడు వేళ.. నేడు కూటమి పెద్దల కీలక భేటీ

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై గత జగన్ ప్రభుత్వానికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిన అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ మరో పర్యటనకు శ్రీకారం చుట్టారు. గుంటూరు తర్వాత ఇక ఇబ్రహీంపట్నానికి వెళ్లనున్నారు.

జగన్ నిర్వహించిన గుంటూరు పర్యటన అనుకున్నదానికంటే అధికంగా విజయవంతం కావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపింది. సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ తిరుమల లడ్డూ కల్తీ జరిగిందంటూ టీడీపీ సారథ్యంలోని కూటమి నాయకులు ఊరూరా ఫ్లెక్సీలు వేయడం, తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలు దాడులకు దారి తీశాయి. పెట్రోల్ బాంబులు విసురుకునేంత స్థాయికి చేరుకుందనేది తేటతెల్లమైంది.

Deputy CM Pawan Kalyan and Madhav to meet CM Chandrababu today in his house as Tirumala Laddu Row

ఈ పరిణామాల మధ్య టీడీపీ కూటమి అధినేతలు నేడు సమావేశం కాబోతోన్నారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటోన్న జనసేన చీఫ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు మాధవ్.. చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఈ ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం ఏర్పాటు కానుంది. తిరుమల లడ్డూ అంశాన్ని ఎలా తిప్పి కొట్టాలి, జగన్ దూకుడును ఎలా అడ్డుకోవాలనే విషయంపై చర్చించే అవకాశం ఉంది.

ఈ ఉదంతంలో వైఎస్ఆర్సీపీ దూకుడును అడ్డుకోవడం కూటమికి ప్రతిష్ఠాత్మకంగా మారింది. దీంతో పాటు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చ జరగనుందని తెలుస్తోంది. శుక్రవారం నుంచి పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనబోతోన్నారు. దీనికి సంబందించిన రూట్ మ్యాప్, బీజేపీ అభ్యర్థులను గెలిపించడానికి అనుసరించాల్సిన వ్యూహాలు కూడా ఈ సందర్భంగా వారి మధ్య చర్చకు వస్తుందని తెలుస్తోంది.

తిరుమల లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వు, చేప నూనె కలిసిందంటూ స్వయానా చంద్రబాబు, పవన్ కల్యాణ్ పలుమార్లు ప్రకటించారు. ఇందులో సాక్షాత్ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. విచారణ జరిపించడానికి సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. అన్ని కోణాల్లోనూ సూక్ష్మస్థాయిలో విచారణ జరిపిన అనంతరం నెయ్యిలో జంతువుల కొవ్వు కల్తీ కాలేదంటూ సిట్ నివేదిక ఇచ్చింది. దీన్ని ఎలా తిప్పి కొట్టాలనేది టీడీపీ కూటమికి సవాల్ గా మారింది.

ఈ ఉదంతంలో వైఎస్ఆర్సీపీ దూకుడును అడ్డుకోవడం కూటమికి ప్రతిష్ఠాత్మకంగా మారింది. దీంతో పాటు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చ జరగనుందని తెలుస్తోంది. శుక్రవారం నుంచి పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనబోతోన్నారు. దీనికి సంబందించిన రూట్ మ్యాప్, బీజేపీ అభ్యర్థులను గెలిపించడానికి అనుసరించాల్సిన వ్యూహాలు కూడా ఈ సందర్భంగా వారి మధ్య చర్చకు వస్తుందని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+