యువతకు పవన్ కళ్యాణ్ పిలుపు .. ఎందుకంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువతకు పిలుపునిచ్చారు. యువత వారానికి ఒకసారి చేనేత వస్త్రాలను ధరిస్తే ఆ రంగంపై ఆధారపడ్డ వారికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా, చేనేత కళాకారులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.
చేనేత కోసం పవన్ కళ్యాణ్ పిలుపు
ఈ రంగంపై ఆధారపడిన వారికి ఉపాధి అవకాశాలు మెరుగు పడాలంటే యువత వారానికి ఒకసారి చేనేత వస్త్రాలను ధరించాలని ఆయన పిలుపునిచ్చారు. నేడు తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రజలతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ దేశంలో చేనేత రంగానికి గల ప్రాధాన్యతను గుర్తు చేశారు. మనదేశ సంస్కృతికి, కళాకారుల సృజనాత్మకతకు, స్వాతంత్రోద్యమ ఆశయాలకు ఆలంబనగా నిలిచిందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.

చేనేతలకు కూటమి ప్రభుత్వ మద్దతు
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చేనేత రంగానికి పూర్తి మద్దతు ఇస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దేశంలో ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించే అసంఘటిత రంగాలలో చేనేత రంగం ఒకటని, ఈ రంగానికి అన్ని విధాలుగా ఊతం ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
చేనేత కుటుంబాలకు ఏడాదికి 25 వేల రూపాయలు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోన జరిగిన మంత్రివర్గ సమావేశంలో చేనేత రంగానికి లబ్ధిని చేకూర్చే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి 25 వేలు ఇచ్చేలా నేతన్న భరోసా పథకాన్ని అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించినట్టు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. నేత మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు.
చేనేత వస్త్రాలకు విస్తృతమైన ప్రచారాన్ని కల్పిస్తాం
సొసైటీల నుండి ఆప్కో కొనుగోలు చేసే వస్త్రాలపై జీఎస్టీ లో ఐదు శాతం రాయితీ అమలు చేస్తున్నామని అన్నారు. త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటుకు కూడా నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రాష్ట్రంలో చేనేత వస్త్రాలకు విస్తృతమైన ప్రచారాన్ని కల్పిస్తామని, చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంచే దిశగా ప్రచార కార్యక్రమాలను పెంపొందిస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications