AP Budget 2025: బడ్జెట్ పై పవన్ రియాక్షన్ ఇదే..!
ఏపీలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. బడ్జెట్ సంక్షేమం, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఉందని, అందుకు అనుగుణంగా కేటాయింపులు ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసిందని, సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు తగ్గించే చర్యలు చేపట్టిందన్నారు.
ఈ బడ్జెట్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల భవిష్యత్తుకు భరోసానిచ్చేలా, అభివృద్ధికి బాటలు వేసేదిగా ఉందని పవన్ తెలిపారు. ప్రాధాన్యతల వారీగా అన్ని శాఖలకు కేటాయింపులు పెరగడంతో పాటు, మూలధన వ్యయాన్ని రూ.40,636 కోట్లకు పెంచడం ద్వారా మౌలిక వసతులు రాష్ట్రంలో పెరుగుతాయన్నారు. తద్వారా రాబోయే రోజుల్లో రాష్ట్ర రాబడి పెంపుదలకు బాటలు వేసినట్లు అయిందన్నారు. రూ.3,22,359 కోట్లతో ప్రణాళికాబద్ధంగా రూపొందిన బడ్జెట్ ఇది అని పవన్ తెలిపారు. సంక్షేమం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ లో కేటాయింపులు చేయడం ప్రభుత్వ విధానాన్ని తెలియజేస్తుందన్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుకు బడ్జెట్లో తగిన కేటాయింపులు జరపడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అని పవన్ తెలిపారు. ఇప్పటికే అందిస్తున్న పింఛన్ల పెంపుదల, దీపం 2 పథకాలకు నిధుల కేటాయింపుతోపాటు మిగిలిన సూపర్ సిక్స్ పథకాల హామీలను తప్పకుండా నెరవేరుస్తామని బడ్జెట్ కేటాయింపుల ద్వారా నిరూపించుకున్నామని పవన్ తెలిపారు. 'తల్లికి వందనం' పథకాన్ని ఈ ఏడాది మే నుంచి అమలు చేసేందుకు రూ.9,407 కోట్లను కేటాయించారని, అన్నదాతలకు భరోసానిచ్చేలా ఏడాదికి రూ.20 వేలు ప్రతి రైతుకు సాయం అందేలా 'అన్నదాత సుఖీభవ' పథకానికి ప్రణాళికలు సిద్ధం అయ్యాయని పవన్ చెప్పుకొచ్చారు.
సాగు నీటి రంగానికి రూ.18,019 కోట్లు కేటాయింపులు శుభపరిణామమని పవన్ తెలిపారు. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అన్న మహాత్ముడి వాక్కు అనుసారం గ్రామీణాభివృద్ధికి రూ.18,890 కోట్ల భారీ కేటాయింపులు ద్వారా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జోరందుకుంటాయని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. నిధుల లేమి అనేదే లేకుండా గ్రామాల్లో అభివృద్ధి ఊపందుకోవడానికి ఈ బడ్జెట్ బాటలు వేస్తుందన్నారు. గ్రామాలకు కావల్సిన వసతులు, సౌకర్యాల కల్పనకు ఈ కేటాయింపులు దోహదం చేస్తాయన్నారు.
జల్ జీవన్ మిషన్ పథకానికి బడ్జెట్ లో ప్రాధాన్యం దక్కడం సంతోషంగా ఉందని తెలిపారు. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కు రాష్ట్ర వాటా కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిందని, వచ్చిన నిధులను ప్రణాళిక లేకుండా ఇష్టానుసారం వ్యయం చేశారని పవన్ తెలిపారు. జల్ జీవన్ మిషన్ ను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2028 వరకు గడువు పొడిగించడం మన రాష్ట్రానికి ప్రయోజనకరమైన విషయమన్నారు. వ్యవసాయానికి కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు చెబుతున్నాయన్నారు. ఆక్వా రైతులకి విద్యుత్ యూనిట్ ధరను రూ.1.50పై. చేయడం హర్షణీయమని పవన్ తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురోభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం ఇతోధిక సహకారం అందిస్తోందని, జల్ జీవన్ మిషన్ పథకం పొడిగింపు ద్వారా మన రాష్ట్రానికి ఎంతో మేలు చేకూరుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇస్తూ మౌలిక వసతుల కల్పనకు తోడ్పాటు ఇస్తున్న ప్రధాని మోడీకి కూడా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, శాఖలకు తగిన కేటాయింపులు, సంక్షేమ ఫలాలపై తగిన దూరదృష్టితో ముందుకు వెళ్తున్న సీఎం చంద్రబాబుకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.
-
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications