జనసేన రాజ్యసభ రేసులో పారిశ్రామిక వేత్త, ప్రముఖ సినీ నిర్మాత - పవన్ ఛాయిస్..!!

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి నేతలు 2029 ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ప్రతిపక్ష వైసీపీ సైతం కూటమిని టార్గెట్ చేస్తోంది. రాజకీయంగా కొత్త నిర్ణయాలకు కూటమి నేతలు సిద్దం అవుతున్నారు. ఏపీ నుంచి ఖాళీ కానున్న నాలుగు రాజ్య సభ స్థానాలు కూటమికే దక్కనున్నాయి. రెండు టీడీపీకి.. బీజేపీ - జనసేన చెరకొటి తీసుకునే విధంగా ఒప్పందం కుదిరింది. జనసేన నుంచి ఇద్దరు పేర్లు ప్రముఖంగా రేసులో వినిపిస్తున్నాయి. ఇప్పుడు వారిలో పవన్ ఛాయిస్ ఎవరు.. ఎవరికి దక్కుతుందనేది ఆసక్తిగా మారుతోంది.

జనసేన తొలి రాజ్యసభలో అడుగు పెట్టనుంది. 2024 ఎన్నికల్లో జనసేన నుంచి ఇద్దరు ఎంపీలు గెలిచి లోక్ సభకు వెళ్లారు. ఇప్పుడు తొలి సారిగా జనసేనకు రాజ్యసభకు అవకాశం దక్కింది. ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో రెండు టీడీపీకి దక్కనున్నాయి. టీడీపీ నుంచి ప్రస్తుతం ఎంపీగా ఉన్న సానా సతీశ్ కు రెన్యువల్ తో పాటుగా మరొక సీటు ప్రముఖ ఫార్మా సంస్థ అధినేతకు కేటాయించే అవకాశం ఉంది. బీజేపీ- జనసేన కు చెరో రాజ్యసభ సీటు దక్కనుంది. బీజేపీ నుంచి తమిళనాడు నేత అన్నామలై లేదా మంద కృష్ణ మాదిగ కు అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. ఇక.. జనసేన నుంచి ఇద్దరు పేర్లు రేసులో ఉన్నాయి. అందులో ఒకరు పారిశ్రామిక వేత్త కాగా.. మరొకరు ప్రముఖ సినీ నిర్మాత ఉన్నారు. వీరిలో పవన్ ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఇప్పుడు పార్టీలో ఆసక్తి కరంగా మారుతోంది.

విజయ్ కు అధికారం ఖాయమా..? లెక్క మారింది అక్కడే, ఐపీఎస్ సంచలన రిపోర్ట్..!!
విజయ్ కు అధికారం ఖాయమా..? లెక్క మారింది అక్కడే, ఐపీఎస్ సంచలన రిపోర్ట్..!!
deputy-cm-pawan-kalyan-to-finalize-the-rajayasabha-canidate-form-janasena-soon-two-persons-as-front

పవన్ ఛాయిస్ ఎవరు..!?

జనసేన నుంచి రాజ్యసభకు పారిశ్రామిక వేత్త లింగమనేని రమేష్ కు కేటాయించే అవకాశం ఉందని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో లింగమేనని పేరు పైన పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో పారిశ్రామిక వేత్త పేరు జనసేన నుంచి రాజ్య సభ రేసులోకి వచ్చింది. సిద్దార్థ్ ఇన్ఫ్రా టెక్ ఎండీ బండారు నరసింహ రావు పేరు సైతం పరిశీలన లో ఉందని పార్టీ నేతల్లో చర్చ సాగుతోంది. నరసింహ రావు 2024 ఎన్నికల్లో జనసేన నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు. ఆ సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు ఆయన పేరు రేసులోకి వచ్చినట్లు తెలుస్తోంది. వీరితో పాటుగా టాలీవుడ్ లో వరసపెట్టి సినిమాలు చేస్తున్న ప్రముఖ నిర్మాత కూడా ఒకరు రాజ్యసభ రేసులోకి వచ్చారు. కొద్ది రోజులుగా ఈ పేర్లు జనసేనలో ప్రచారంలోకి వచ్చాయి. అయితే.. పవన్ సినీ ఇండస్ట్రీ.. పారిశ్రామిక వేత్తల్లో ఒకరిని ఎంపిక చేస్తారా .. లేక, పార్టీ కోసం పని చేసిన సాధారణ వ్యక్తికి రాజ్యసభకు పంపి తన ప్రత్యేకత చాటుతారా అనేది ఇప్పుడు పార్టీలో చర్చగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+