జగన్ అసెంబ్లీకి రాకుంటే జరిగేది ఇదే - రఘురామ సంచలనం..!!
మాజీ సీఎం జగన్ వ్యవహార శైలి పై డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ నెల 18వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు వస్తే అన్ని అంశాల పైన చర్చకు సిద్దమని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే, తమకు ప్రతిపక్ష హోదా పైన తేల్చాలని వైసీపీ కోరుతోంది. దీంతో.. జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుంటే జరిగే పరిణామాల పైన రఘురామ రాజు ఆసక్తి కర విశ్లేషణ చేసారు. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.
మాజీ సీఎం జగన్ ప్రతిపక్ష హోదా అడగటం పైన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. జగన్ చంటి పిల్లొడని.. చందమామా కోసం మారాం చేసినట్లుగా చేస్తున్నారని సెటైర్లు వేసారు. జగన్ 60 రోజులు అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఆటోమేటిక్‌గా డిస్ క్వాలిఫై అయిపోతారని చెప్పుకొచ్చారు. ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలకు జగన్ రాకపోతే పులివెందుల అసెంబ్లీకి బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉండవచ్చని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేలు శాసనసభా సమావేశాన్ని బహిష్కరిస్తే ఆ పదవికి అర్హత లేనట్లుగానే భావించాలని పేర్కొన్నారు. వయసులో పెద్దవాడిగా, శాసనసభా ఉపసభాపతిగా సమావేశాలకు జగన్ రావాలని కోరుతున్నానని అన్నారు. జగన్ అసెంబ్లీకి రావడానికి సిద్ధమా అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సవాల్ విసిరారని.. ఆ సవాల్‌ను జగన్ స్వీకరించాలని సూచించారు.

జగన్ తో పాటుగా ఎమ్మెల్యేలు సైతం అసెంబ్లీకి హాజరు కాకుంటే వైసీపీ గెలిచిన 11 స్థానాలకు కూడా బై ఎలక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. అయితే, అటు జగన్ మాత్రం అసెంబ్లీకి హాజరయ్యే అవకాశాలు కనిపించటం లేదు. జగన్ కోరినట్లుగా ప్రతిపక్ష హోదా తాము ఇచ్చేది కాదని.. ప్రజలే తిరస్కరించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. గతంలో సైతం జగన్ పైన అనర్హత వేటు అవకాశం పైన చర్చ జరిగింది. దీనికి జగన్ సైతం స్పందించారు. తాను సిద్దంగా ఉన్నానని.. ఎలాంటి చర్యలు అయినా తీసుకోవచ్చని తేల్చి చెప్పారు. ఇక, ఇప్పుడు రఘురామ చేసిన వ్యాఖ్యలతో మరోసారి జగన్ అసెంబ్లీకి హాజరు కాకుంటే.. అనర్హత వేటు ఖాయమా అనే చర్చ జరుగుతోంది. పులివెందులలో తాజాగా జరిగిన జెడ్పీటీసీ ఎన్నికలో టీడీపీ విజయం సాధించింది. దీంతో.. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల వేళ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications