కక్ష సాధింపు: తెలుగు రాష్ట్రాల 'ఓటుకు నోటు'పై దేవెగౌడ
బెంగళూరు: కక్ష సాధింపు కోసం రాజకీయ నాయకులు ఎంతకైనా తెగిస్తారని మాజీ ప్రధాని దేవెగౌడ వ్యాఖ్యానించారు. బెంగళూరులో శనివారం నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన ఓటుకు నోటు పైన అడిగిన ప్రశ్నకు స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. తెహెల్కా పత్రిక చాలమంది నాయకుల వ్యవహారాన్ని బయటపెట్టిందని, చివరకు ఏమైందని, ఏడాది క్రితం గోవా హోటల్లో లిఫ్ట్‌లో మహిళ పైన చేయి వేశారంట ఎడిటర్‌ను జైలు పాలు చేశారన్నారు.

ఉపాధి కుంభకోణం పేరిట హర్యానా నేత ఓం ప్రకాశ్ చౌతాలాను జైలుకు పంపారన్నారు. మన దేశంలో రాజకీయ నేతలు కక్ష సాధింపు కోసం ఎంతటికైనా తెగిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు.
బీహార్‌లో జేడీయూ, ఆర్జేడీ తదితర పార్టీల విలీనం నేపథ్యంలో బీజేపీకి గెలుపు అంత సులభం కాదన్నారు. మోడీ ఏడాది పాలన ప్రజల అంచనాలు అందుకోలేదని చెప్పారు. అయితే, ఏడాది పాలనలో కాంగ్రెస్ పార్టీకి భిన్నంగా అవినీతి లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications