• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీబీఐ చిటికేస్తే జగన్ ఏమవుతారు..మదమెక్కి: మీ ఎంపీలు సర్దుకుంటున్నారు..అది సీఎం స్క్రిప్టు : ఉమా ఫైర్

|

మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను..ఉపయోగించిన పరుష పదజాలాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమా ఖండించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన స్క్రిప్టునే మంత్రి కొడాలి నాని చదివారని ఆరోపించారు. సీఎం .. మంత్రులు పైశాచికానందంతో..మదమెక్కి వ్యవహరిస్తున్నారని..వారికి బెదిరిపోమని చెప్పుకొచ్చారు. సన్నబియ్యం ఇస్తామన్నారు..ఇవ్వండి అని ప్రశ్నిస్తే నీచంగా తిట్టిస్తున్నారని దుయ్యబట్టారు.

22 మంది ఎంపీలు గెలుచుకున్న ఎంపీల్లో 12 మంది సర్దుకుంటున్నారని..మీ ఇంటిని సరి చేసుకోవాలని కీలక వ్యాఖ్యలు చేసారు. తిరుపతి గురించి మంత్రి మాట్లాడిన వ్యాఖ్యలు మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉన్నాయని ఆరోపించారు. మద్యం వ్యాపారులతో రెండు వేల కోట్ల బేరసారాల పైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు.

సీబీఐ చిటికేస్తే జగన్ ఏమవుతారు..

సీబీఐ చిటికేస్తే జగన్ ఏమవుతారు..

జగన్ చిటికేస్తే టీడీపీని వైసీపీ స్టోర్ రూంలో పెడతామని మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యల పైన మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్రంగా స్పందించారు. ప్రతీ శుక్రవారం కోర్టుకు వెళ్తున్న సీఎం జగన్ పైన సీబీఐ చిటికేస్తే ఏమవుతారని ప్రశ్నించారు. పార్టీ కోసం ప్రాణాలిచ్చే నేతలు..కార్యకర్తలు టీడీపీలో ఉన్నారని..ఇటువంటి బెదిరింపులకు భయపడరని చెప్పుకొచ్చారు.

ముఖ్యమంత్రిలో అభద్రతా భావం..ఫ్రెష్టేషన్ ఎక్కువ అయ్యాయని..మంత్రులు మాట్లాడుతున్న స్క్రిప్టు సీఎందేనని విమర్శించారు. ముఖ్యమంత్రి..మంత్రుల భాష మీద ప్రజలు ఏమనుకుంటున్నారో చూడాలన్నారు. గతంలో జగన్ ముఖ్యమంత్రి పైన ఘాటుగా వ్యాఖ్యాలు చేసినా..ప్రజాస్వామ్య పద్దతితోనే తిప్పి కొట్టామని..ఇటువంటి భాష ప్రయోగించలేదని గుర్తు చేసారు.

సీఎం స్క్రిప్టునే నాని చదివారు

సీఎం స్క్రిప్టునే నాని చదివారు

ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన స్క్రిప్టునే మంత్రి నాని చదివారని ఉమా వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును..తనను..తమ పార్టీ నేతల పైన ఇంత అసభ్యంగా ముఖ్యమంత్రి ఎలా మాట్లాడించారని ప్రశ్నించారు. పేదవారికి సన్నబియ్యం ఇవ్వమని అడిగితే ఇంత దారుణంగా తిడతారా అని ఆవేదన వ్యక్తం చేసారు.

పాదయాత్ర సమయంలో జగన్.. ఆ తరువాత మంత్రులు సన్నబియ్యం ఇస్తామని చెప్పారని.. ప్రతిపక్ష పార్టీగా అదే అడిగితే తిడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి..మంత్రులది పైశాచికానందం అని..వీటికి బెదిరిపోమని చెప్పుకొచ్చారు. చంద్రబాబు దీక్ష గురించి హీనంగా మాట్లాడారని.. లక్ష రూపాయాలకు ఇసుక అమ్ముకుంటున్నవారి వివరాలతో ఛార్జ్ షీట్ విడుదల చేసామన్నారు. మంత్రిగా ఉన్న వ్యక్తి మాట్లాడిన మాటలకు సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు.

మీ ఎంపీలు సర్దుకుంటున్నారు..చూసుకోండి

మీ ఎంపీలు సర్దుకుంటున్నారు..చూసుకోండి

ఇదే సమయంలో దేవినేని ఉమా కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి జగన్ తన ఎంపీలకు క్లాస్ తీసుకున్నారని..విజయ సాయిరెడ్డి లేకుండా ప్రధానిని..మంత్రులను కలవద్దని చెబుతున్నారన్నారు. మీ పార్టీకి చెందిన 10 నుండి 12 మంది ఎంపీలు సర్దుకుంటున్నారని..ముందుగా మీ ఇల్లు సరి చేసుకోవాలని హెచ్చరించారు. టీడీపీలో పార్టీ కోసం ప్రాణాలిచ్చే నేతలు..కార్యకర్తలు ఉన్నారని చెప్పారు.

వైసీపీ నేతలు ఇచ్చే వార్నింగ్ లకు ఎవరూ భయపడరన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులు నడుస్తున్నాయని..వైసీపీ నేతలే అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు. వెయ్యి కోట్ల ముడుపులు ఏంటనేది ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు.

భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా..

భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా..

మంత్రి కొడాలి నాని తిరుపతి గురించి మాట్లాడుతూ..అసభ్యంగా మాట్లాడారని..ఎవరికి సంతకం పెట్టాలి..ఎవరికి డిక్లరేషన్ ఇవ్వాలని ప్రశ్నించారని గుర్తు చేసారు. దీని ద్వారా తిరుపతి సంప్రదాయాలు.. భక్తుల మనోనభావాలు దెబ్బ తీసే విధంగా మంత్రి మాట్లాడారని ఆరోపించారు. అసలు భక్తుల విశ్వాసాలు దెబ్బ తీసే అధికారం సీఎంకు ఎవరిచ్చారని ప్రశ్నించారు.

మరో మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ చేసిన వ్యాఖ్యలను రాయటానికి కూడా మీడియా ఇబ్బంది పడిందని చెప్పుకొచ్చారు. సిమెంట్ ధరలు ఎందుకు పెరిగాయని..సిమెంట్ కంపెనీలతో రెండు వేల కోట్ల మేర బేర సారాల వెనుక కధ ఏంటో చెప్పాలన్నారు. పోలవరం నిధులు సాధించలేని ప్రభుత్వం అంటూ ఫైర్ అయ్యారు.

English summary
Ex minister Deveineni Uma slas Cm Jagan on minister Nani abusing comments against CBN and him. He demanded to CM must respond on Nani comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X