పుట్టగతులు ఉండవు: కెవిపి-విజయసాయిలకు దేవినేని హెచ్చరిక

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంశంపై రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు, వైసిపి ఎంపీ విజయ సాయి రెడ్డి విషం చిమ్మారని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మండిపడ్డారు.

విజయవాడ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అంశంపై రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు, వైసిపి ఎంపీ విజయ సాయి రెడ్డి విషం చిమ్మారని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మండిపడ్డారు.

చదవండి: జగన్ వద్దకు ప్రశాంత్ కిషోర్: బిజెపి నేత ఐడియానా, బాబుకు చెక్?

రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరంపై పక్క రాష్ట్రాలకు లేనిపోని సమాచారం ఇవ్వడం ద్వారా ప్రాజెక్టును అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పోలవరం నిర్మాణాన్ని చూడకుండానే ప్రాజెక్టుపై రాళ్లు వేస్తున్నారన్నారు.

Devineni lashes out at KVP and Vijaya Sai Reddy

ఈ నిర్మాణాన్ని చూసి ప్రజలు గర్వపడుతున్నారన్నారు. పోలవరం జోలికొస్తే ఆ పార్టీల నేతలకు పుట్టగతులు ఉండవన్నారు. ఇప్పటికే పట్టిసీమతో వైసిపి పునాదులు కదిలాయన్నారు.

రూ.33 వేల కోట్లతో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నట్టు చెప్పారు. ప్రాజెక్టులను అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. పోలవరం నిర్వాసితుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.

సవరించిన అంచనాలు తయారు చేసి త్వరలోనే కేంద్రానికి పంపిస్తామన్నారు. 2013 భూసేకరణ చట్టం కింద పరిహారం చెల్లించనున్నట్టు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+