పిల్లకాకితో వెళితే నష్టపోతావని చెప్పా: దేవినేని చేరికపై జలీల్ ఖాన్
అమరావతి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ గురువారం సాయంత్రం వేలాదిమంది కార్యకర్తలు, అభిమానుల నడుమ చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. దేవినేని నెహ్రూ టీడీపీలో చేరడంపై విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ స్పందించారు.
రాజధానిని అడ్డుకుంటారా, ప్రాణాలిస్తా, బాబును తప్పుపట్టా: జగన్‌ను ఏకేసి టిడిపిలోకి నెహ్రూ శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకానొక దశలో దేవినేని నెహ్రూని వైసీపీకి చెందిన కొందరు నేతలు కలిసే ప్రయత్నాలు చేశారని ఆయన తెలిపారు. అయితే పిల్లకాకితో వెళితే నష్టపోతావని నెహ్రూకు తాను చెప్పినట్లు జగన్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు.
నెహ్రూ రాజకీయ అనుభవం ముందు వైసీపీది ఎంత? అని జలీల్ ఖాన్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి ఆయన రాకను స్వాగతిస్తున్వామని చెప్పారు. వైసీపీ నుంచి టీడీపీలోకి మాకు రూ. 30 కోట్లు ఇచ్చారని వైసీపీ చేస్తోన్న ఆరోపణలపై కూడా ఆయన మండిపడ్డారు.

30 కోట్లు కాదు కదా? 30 పైసలు కూడా ఇవ్వలేదు
తనకు రూ. 30 కోట్లు కాదు కదా? 30 పైసలు కూడా ఇవ్వలేదని అన్నారు. కాగా, గురువారం విజయవాడలోని గుణదలలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు.. నెహ్రూ ఆయన తనయుడు అవినాష్, కడియాల బుచ్చిబాబుతోపాటు వందలాది మంది నాయకులు టీడీపీలో చేరారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కళావెంకట్రావు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో సీఎంతోపాటు, పలువురు నాయకులు వారి అభిప్రాయాలను పంచుకున్నారు. తొలుత ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు.. ఎన్టీఆర్ ప్రతిమకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

జగన్ అమరావతిని అడ్డుకోవాలని చూస్తున్నారు
టీడీపీలో చేరిన సందర్భంగా దేవినేని నెహ్రూ మాట్లాడుతూ వైసీపీ అధినేత వైయస్ జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ రాజధాని అమరావతిని అడ్డుకోవాలని చూస్తున్నారని, కానీ తాము రాజధానికి రక్షణ కవచంలా ఉంటామని దేవినేని నెహ్రూ అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చంద్రబాబుకే సాధ్యమన్నారు. అమరావతి సృష్టికర్త చంద్రబాబు అన్నారు. అమరావతి కోసం ప్రాణాలు అర్పిస్తానన్నారు.

అమరావతికి చంద్రబాబు రక్షణ కవచంగా ఉన్నారు
అమరావతికి చంద్రబాబు రక్షణ కవచంగా ఉన్నారన్నారు. అమరావతి రైతులతో మాట్లాడిన తర్వాత తాను మళ్లీ ఆ ప్రాంతానికి వెళ్లలేదని చెప్పారు. వారు సంతోషంగా భూములు ఇచ్చారన్నారు. కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి రక్షణ కవచంలా ఉంటానని చెప్పారు. తాను 1983లో తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు, టిడిపి జెండా కప్పుకునే చనిపోతానని చెప్పానని గుర్తు చేశారు. అలాగే చేస్తానన్నారు.

పట్టిసీమను ఏడాదిలో పూర్తి చేస్తానని చంద్రబాబు చెప్పారు
పట్టిసీమను ఏడాదిలో పూర్తి చేస్తానని చంద్రబాబు చెప్పారని, తొలుత తాను కూడా పట్టిసీమను వ్యతిరేకించానని, కానీ దానిని ఏడాదిలో పూర్తి చేశారన్నారు. తాను చంద్రబాబు సంక్షేమ పథకాలను ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. విపక్షానికి ఏమాత్రం అవగాహన లేదన్నారు. జగన్‌కు అనుభవం లేదన్నారు. రాజధానిని అడ్డుకోవాలని చూడటం సరికాదన్నారు.

ఎన్టీఆర్ తనకు రాజకీయ భిక్ష పెట్టారు
నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పైన ప్రకటన చేయకముందే తాను కలిశానని గుర్తు చేశారు. ఎన్టీఆర్ తనకు రాజకీయ భిక్ష పెట్టారన్నారు. నాలుగుసార్లు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు. చంద్రబాబుతో కలవాలని ఎప్పటి నుంచో అనుకున్నానని, కానీ ఏదో అవరోధం వచ్చిందన్నారు. ఇప్పుడు నా కోరిక నెరవేరిందన్నారు.












Click it and Unblock the Notifications