జగన్‌పై ఉమ నిప్పులు: సింగపూర్ ప్రతినిధులతో..

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు నిప్పులు చెరిగారు. సొంత పార్టీ నేతలు చేజారిపోతున్నారనే నిరాశా నిస్పృహలతో జగన్‌ మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. 35 సీఎంగా ఉంటాన్న జగన్‌ మాటలపై ఆయన శనివారం తీవ్రంగా మండిపడ్డారు. 30 ఏళ్ల తర్వాత కూడా జగన్‌ సీఎం కాలేరన్నారు.

శాపనార్థాలు పెట్టడం, జోస్యాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. ఏ క్షణాన కటకటాల వెనక్కి వెళ్లాల్సి వస్తుందో దాని గురించి ఆలోచించుకోవాలని మంత్రి దేవినేని ఉమా అన్నారు. మంత్రి అచ్చెన్నాయుడ కూడా జగన్‌పై మండిపడ్డారు. తండ్రి శవాన్ని పెట్టుకుని జగన్‌ సీఎం కావాలనుకున్నాడని ఆరోపించారు. 30 ఏళ్లు సీఎంగా ఉంటానన్న జగన్‌ మాట అచ్చుతప్పు అని 35 ఏళ్ల తరువాత కూడా జగన్‌ సీఎం కాబోరని మంత్రి అచ్చెన్నాయుడు జోస్యం చెప్పారు.

Devineni Uma fires at YS Jagan

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్న సింగపూర్ ప్రతినిధులతో శనివారం రాష్ట్ర మంత్రి నారాయణ సమావేశమయ్యారు. డిఆర్‌డిఎ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో రాజధాని భూసేకరణ, ఇతర అంశాలపై ప్రధానంగా చర్చించారు. సిఆర్‌డిఎ ప్రత్యేక కమిషనర్ శ్రీకాంత్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కాగా, కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన తెలుగుదేశంలో చేరడానికి నిర్ణయించుకునే కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+