కిరణ్, జగన్ డ్రామాలు: దేవినేని ఉమ, కిరణ్‌పై కొండ్రు
విజయవాడ: తెలంగాణ బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు పదవుల కోసం వెంపర్లాడుతున్నారని తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
సీమాంధ్రకు అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో పదవుల కోసం కక్కుర్తిపడడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.సమైక్య వాదం ముసుగులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి డ్రామాలాడుతున్నారని ఆయన విమర్శించారు.

కాంగ్రెస్, జగన్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కుమ్మక్కయి కుట్ర పన్నుతున్నారని ఆయన అన్నారు. విభజన జరిగితే తెలంగాణ జిల్లాల రైతులకు నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తారని ఆయన ప్రశ్నించారు.
కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నట్లు తాజా మాజీ మంత్రి కొండ్రు మురళి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పటికైనా కాంగ్రెసు పార్టీలోకి రావాల్సిందేనని ఆయన అన్నారు. సీమాంధ్ర రాజధాని విశాఖపట్నమేతే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications