ఇప్పుడు మీరు సీఎం-నేను మంత్రి!: కేసీఆర్-దేవినేని మధ్య ఆసక్తికర సంభాషణ
Recommended Video

విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు గురువారం బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన దుర్గమ్మకు ముక్కు పుడుకను కానుకగా సమర్పించారు.
కాగా, విజయవాడకు వచ్చిన కేసీఆర్ దంపతులకు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఘన స్వాగతం పలికారు. ఆలయంలోకి దగ్గరుండి తీసుకెళ్లారు మంత్రి దేవినేని.

ఆమరణలు దీక్షలు చేశాం
ఈ సందర్భంగా కేసీఆర్, దేవినేని ఉమల మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. కుశల ప్రశ్నలతో మొదలైన వారి సంభాషణ రాష్ట్ర విభజన వరకు వెళ్లింది. ‘తెలంగాణ కోసం మీరు ఆమరణ దీక్ష చేస్తే.. సమైక్యాంధ్ర కోసం తాను ఆమరణ దీక్ష చేశాను' అని మంత్రి దేవినేని.. కేసీఆర్‌తో అన్నారు.

మీరు సీఎం-నేను మంత్రి.. కేసీఆర్ స్పందన ఇలా..
అంతేగాక, ‘రాష్ట్రం విడిపోయింది.. తెలంగాణకు మీరు సీఎం అయితే.. ఏపీలో నేను మంత్రినయ్యా' అని దేవినేని చెప్పుకొచ్చారు. దేవినేని వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం అదేనిన అన్నారు.

పూర్ణకుంభ స్వాగతం
కాగా, విజయవాడ కనకదుర్గ అమ్మవారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం దర్శించుకున్నారు. కుటుంబసమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి చేయించిన ముక్కుపుడకను నెత్తిన పెట్టుకుని మేళతాళాల మధ్య కేసీఆర్ ఆలయంలోనికి ప్రవేశించారు.

ముక్కుపుడక సమర్పించారు
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కేసీఆర్ ముక్కపుడకను కనకదుర్గ అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు కేసీఆర్ గోత్ర నామాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ సతీమణి, కోడలు, మనవలు, పలువురు బంధువులు, తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్‌ను చూసేందుకు భక్తులు పోటీపడ్డారు.












Click it and Unblock the Notifications