టీ ప్రభుత్వం కక్ష: హరీష్ రెచ్చగొడ్తున్నారని దేవినేని

విశాఖ/విజయవాడ: తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపుతోనే కృష్ణా డెల్టాకు నీటి విడుదలను నిలిపి వేసిందని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు శనివారం ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సాగర్‌ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం కబ్జా చేసిందన్న తెలంగాణ మంత్రి హరీష్‌ రావు వ్యాఖ్యలు సరికావన్నారు.

కృష్ణా డెల్టా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నీటి విడుదలకు సహకరించాలన్నారు. సమస్య పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని తెలిపారు. పంటలను, రైతులను కాపాడుకోవాలనేదే తమ ఉద్దేశ్యమని చెప్పారు. నెల రోజుల నుండి కృష్ణా డెల్టాకు నీటి విడుదల నిలిపివేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

మూడు ప్రాంతాల రైతులు తమకు సమానమేనని దేవినేని చెప్పారు. రెండు రాష్ట్రాల అధికారుల కలిసి మెలిసి పని చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. హరీష్ రావు రైతాంగాన్ని రెచ్చగొట్టేలా, బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

Devineni Umamaheswar Rao condemned Harish Rao comments

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన బృహత్తర ప్రణాళికను ఫిబ్రవరి 28 నా టికి సిద్ధం చేస్తామని యూఎస్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ప్రతినిధులు తెలిపారు. ఇందుకయ్యే వ్యయాన్ని బిజినెస్‌ కౌన్సిల్‌, యూఎస్‌ డెవల్‌పమెంట్‌ ఏజెన్సీలు భరిస్తాయని శుక్రవా రం విశాఖలోజరిగిన సమావేశంలో వారు వివరించారు.

ఈ సమావేశంలో విపత్తుల యాజమాన్యం, స్మార్ట్ సిటీలపై ఐబీఎం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చింది. విశాఖతో సహా దేశంలోని పలు నగరాలను స్మార్ట్‌ సిటీలుగా అభివృద్ధికి అవసరమైన సాయమందించేందుకు అమెరికాలోని రాక్ పిల్లర్‌ ఫౌండేషన్‌ ముందుకువచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+