ఎవరూ మిగలరు జాగ్రత్త: వైయస్ జగన్‌కు టీడీపీ నేతల హెచ్చరిక
విజయవాడ: ప్రభుత్వాన్ని కూల్చేస్తానంటూ ప్రతిపక్ష నేత, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వాన్ని కూల్చడం కాదు.. దమ్ముంటే మీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఆ స్థానాల్లో తిరిగి గెలవండి' అని మంత్రులు సవాల్ విసిరారు.
ప్రతిరోజూ అవినీతి కేసుల్లో మునిగితేలుతున్న జగన్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్దంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చుతానన్నందుకు జగన్‌పై దేశద్రోహం కేసు కూడా నమోదుచేయొచ్చని చెప్పారు. శుక్రవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మీడియాతో మాట్లాడిన నాయకులు గురువారం జగన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో స్పందించారు.

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభల్లో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘ఓర్పు ఉన్నంత వరకు సహిస్తాం.. ఓర్పు నశిస్తే వైసీపీ ఎమ్మెల్యేలను మా పార్టీలో చేర్చుకుంటాం.. ఇక ఎవరూ మిగలరు జాగ్రత్త!' అని హెచ్చరించారు.
ఏపీ అభివృద్ధికి అడ్డుతగిలితే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి సిద్ధంగా ఉన్న 28 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటామని చెప్పారు. బీజేపీతో కలిపి తమకు 108 మంది ఎమ్మెల్యేలుంటే జగన్ తమ ప్రభుత్వాన్ని పడగొడతామనడం విడ్డూరంగా ఉందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు.
జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలు, కుట్రలను ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, ఉక్కుపాదంతో అణిచివేస్తామని ఆయన అన్నారు. శుక్రవారం ఆయన కృష్ణా జిల్లాలోని మోపిదేవిలో ఆయన మాట్లాడుతూ జగన్ వ్యాఖ్యలు చేయటం అతడి రాజకీయ అవివేకానికి నిదర్శనమన్నారు.
జ్యోతిష్యుల మాటల ప్రకారం తాను ముఖ్యమంత్రి అవుతానని జగన్ కలలు కంటున్నాడని, రానున్న ఎన్నికలలో ఆయన ఏ జైలులో ఉంటాడో ముందుగా తేల్చుకోవాలని ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నెల్లూరులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
వైయస్ఆర్ కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల పేర్లు బహిర్గతం చేయాలని ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమ నాయుడు సవాల్ విసిరారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ జగన్‌లో అభద్రతాభావం పెరిగిపోవడంవల్లే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘ముఖ్యమంత్రి ఏనాడూ వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి పిలవలేదు. జగన్ తీరుతో విసిగిపోయి ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి.. వారంతటవారే వచ్చి వెళుతున్నారు'' అని అన్నారు.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications