మత్తు మందు ఇచ్చి తిరుమల మహిళా భక్తుల దోపిడీ: చిక్కిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్
విజయవాడ: తిరుమల వసతి గృహంలో సేద తీరుతున్న భక్తులకు మత్తుమందు ఇచ్చి అందినవరకు దోచుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం దొంగతనం జరిగింది. అయితే బాధితులు గురువారం స్పృహలోకి రావడంతో విషయం తెలిసింది.
తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళలు కౌస్తుభంలోని రూమ్ నెం. 235లో బస చేశారు. వారు విశ్రాంతి పొందుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు వెళ్లి మత్తు మందు కలిసిన టీ తాగించారు. బాధితులు మత్తులోకి జారిపోయిన తర్వాత వారి వద్ద ఉన్న నగలు, నగదు ఎత్తుకెళ్లిపోయారు.
స్పృహాలోకి వచ్చిన తర్వాత విషయం తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల్లో ఓ మహిళ ఇంకా మత్తులో ఉండడంతో ఆమెను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదిలావుంటే, పోలీసులకు దొరకుండా తప్పించుకు తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కర్రి సతీష్‌ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నం జిల్లా గాజువాక, పరవాడలో 9 చోట్ల దొంగతనాలకు పాల్పడిన సతీష్ 40 తులాల బంగారాన్ని అపహరించాడు. నిందితుడి నుంచి పోలీసులు 23తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పిడుగుపాటుకు ఇద్దరు మృతి
విజయనగరం జిల్లాలోని కొమరాడ మండలం, కల్లికోట దగ్గర నాగావళి నది ఒడ్డున పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
ఇద్దరిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు
విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ముంచుంగిపుట్టు మండలం లక్ష్మీపురంలో ఈ ఘటన జరిగింది. వైస్ సర్పంచ్ ధనుంజయ, సాక్షర భారత్ కోఆర్డినేటర్ వంతల నీలకంఠ కిడ్నాప్‌కు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. తమవారిని ఎలాగైనా విడిపించాలని కుటుంబసభ్యులు పోలీసులను కోరుతున్నారు.












Click it and Unblock the Notifications