ముళ్ళ కంపలపై పొర్లుతూ.. కంపకల్లి ఉత్సవం.. ఏపీలోని ఆ జిల్లాలో స్పెషల్!!
భారతదేశం విభిన్న సంస్కృతులకు,విభిన్న ఆచారాలకు నెలవు. అటువంటి భారతదేశంలో అనాదిగా వస్తున్న ఎన్నో వింత ఉత్సవాలు జరుగుతున్నాయి.తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా హున్సా గ్రామంలో హోలీ పండుగ రోజు పిడిగుద్దులాట ఆడతారు. ఒకరినొకరు కొట్టుకుంటూ ముష్టి ఘాతాలకు దిగుతారు. ఆపై శుభాకాంక్షలు చెప్పుకుని ఆ ఆచారాన్ని ముగిస్తారు. నిజామాబాద్ జిల్లా మల్కాపూర్ గ్రామంలో బండరాయి క్రింద చిన్న సందులో నుండి దూరి వెళ్తే రోగాలు తగ్గుతాయని నమ్ముతారు.
అలాగే ప్రకాశం జిల్లాలోని హనుమంతుని పాడు మండలం చిన్న గొల్లపల్లి లో ప్రతి సంవత్సరం అనాదిగా వస్తున్న సాంప్రదాయంలో భాగంగా కంపకల్లి ఉత్సవం జరుగుతుంది. చిన్న గొల్లపల్లి లో చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇక్కడ కంపకల్లి ఉత్సవం జరుగుతుంది.ఈ ఉత్సవం సమయంలో వింత ఆచారాన్ని అక్కడివారు పాటిస్తూ ఉంటారు.ఇందులో భాగంగా వాళ్లు ముళ్ళకంప లపై దొర్లి చెన్నకేశవ స్వామికి మొక్కులు తీర్చుకుంటారు.

చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ముళ్ళకంప లపై దొర్లి మొక్కులు తీర్చుకోవడం తోపాటు,మరేవైనా కోరికలు ఉంటే అలా ముళ్ల కంపపై దొర్లితే ఖచ్చితంగా తీరుతాయని వారు నమ్ముతారు.అందుకే ప్రతి సంవత్సరం చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కంపకల్లి ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
చిన్న ముల్లు గుచ్చుకుంటేనే అది ఎంతగానో ఇబ్బంది పెడుతుంది. అటువంటిది ముళ్ళకంప పై దొర్లడం అంటే అత్యంత ప్రమాదకరం. అందులోనూ చిన్న పిల్లలను కూడా ముళ్ళకంపలపై దొర్లిస్తూ ఉత్సవాలను నిర్వహిస్తుండడంతో ఐసిడిఎస్, పోలీస్ అధికారులు ఆ విధంగా చేయడం మంచిది కాదని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అయినప్పటికీ అనాదిగా వస్తున్న ఆచారాలలో భాగంగా చాలామంది నేటికీ కంపకల్లి ఉత్సవంలో ముళ్ళకంపలపై దొర్లుతున్నారు.
అయితే కరోనా మహమ్మారి విజృంభించడంతో గత మూడు సంవత్సరాలుగా ఈ కంపకల్లి ఉత్సవాన్ని నిర్వహించలేదు. ఈ సంవత్సరం మళ్లీ కంపకల్లి ఉత్సవాన్ని నిర్వహించడంతో ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు.ఐదు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవంలో నిన్న చివరి రోజు కావడంతో,తుమ్మ ముళ్ళ కంపను పెద్ద కుప్పగా వేసి దానిపై దొర్లుతూ భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు.
-
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం












Click it and Unblock the Notifications