వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుళ్ళో దర్శనాలు ఓకే .. గంట మోగుతుందా.. తీర్ధ ప్రసాదాల మాటేమిటి ?

|
Google Oneindia TeluguNews

కరోనా నియంత్రణా చర్యల్లో భాగంగా దేశమంతా లాక్ డౌన్ విధించడంతో ఆ ప్రభావం ఆలయాల మీద పడింది. ఇక లాక్‌డౌన్ ఆంక్షల నుండి మినహాయింపులు ప్రకటిస్తున్న నేపధ్యంలో ఏపీలోని ప్రముఖ దేవాలయాలు త్వరలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించబోతున్నాయి . అన్నవరం సత్య దేవుని ఆలయం , చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి దేవాలయంతో పాటు, కాణిపాకం వరసిద్ది వినాయకుడి ఆలయం తదితర ప్రముఖ ఆలయాలు భక్తుల దర్శనాలకు విధి విధానాలు రూపొందిస్తున్నాయి.

లాక్ డౌన్ ఎఫెక్ట్..భిక్షాటన చేస్తున్న అర్చకుల దైన్యం..సర్కారు చెయ్యలేదా న్యాయంలాక్ డౌన్ ఎఫెక్ట్..భిక్షాటన చేస్తున్న అర్చకుల దైన్యం..సర్కారు చెయ్యలేదా న్యాయం

 గుడి గంటలు మోగే అవకాశం లేనట్టేనా

గుడి గంటలు మోగే అవకాశం లేనట్టేనా

ఆలయంలో దర్శనాల కోసం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చెయ్యటానికి కసరత్తులు జరుగుతున్నాయి . అయితే ఆలయాల్లో గంటలు కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో మోగించే అవకాశం లేకుండా పోనుంది . ఎందుకంటె ఆలయంలోకి వచ్చిన వారంతా గంట మోగించి మరీ భగవంతుని దర్శనం చేసుకుంటారు. అయితే అందరూ గంటలను ముట్టుకుంటే కరోనా వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి గుడి గంటలు మూగ బోనున్నాయని తెలుస్తుంది.

ఆలయాల్లో భక్తుల దర్శనాలకు కసరత్తులు

ఆలయాల్లో భక్తుల దర్శనాలకు కసరత్తులు


లాక్‌డౌన్ 3.0 ముగుస్తున్న నేపథ్యంలో ఆలయాల్లో భక్తులకు తిరిగి దర్శనాలు కల్పించే ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు దేవాదాయశాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఇక దర్శనాలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ప్రధాన ఆలయాలు తెరుచుకోనున్నాయి. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత దేవాలయాలు తెరిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. కరోనా కట్టడి ఇంకా జరగని నేపధ్యంలో ఆలయానికి వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకూ భక్తులు పలు నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

Recommended Video

AP CM YS Jagan Review Meeting On Coronavirus Pandemic @ Tadepalli
 తీర్ధ ప్రసాదాలు ,శఠారీ విషయంలో దేవాదాయ శాఖ, అర్చకుల తర్జన భర్జనలు

తీర్ధ ప్రసాదాలు ,శఠారీ విషయంలో దేవాదాయ శాఖ, అర్చకుల తర్జన భర్జనలు

ఈ నేపథ్యంలో అర్చకులు ఇచ్చే తీర్థం, ప్రసాదం, శఠారీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేదానిపై దేవాదాయ శాఖాధికారులు, తర్జనభర్జనలు పడుతున్నారని సమాచారం.
కరోనా రాకుండా ఉండాలంటే ముఖ్యంగా సామాజిక దూరం పాటించాలి. అలాంటి సమయంలో శఠ గోపురం పెట్టటం , తీర్ధం ప్రసాదం ఇవ్వటం అంత శ్రేయస్కరం కాదు అని చర్చిస్తున్నట్టు సమాచారం . ఒకవేళ ప్రసాదం ఇచ్చినా ప్యాకింగ్ చేసి వారికి అందించే ఏర్పాటు చెయ్యనున్నారు. కరోనా ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉంది కాబట్టి ఒకరిపై పెట్టిన శఠ గోపురం మరొకరి తలపై పెట్టడం, ఇలాగే తీర్థప్రసాదాలు పెట్టడం సురక్షితం కాదనే భావన నేపధ్యంలో దేవాదాయ శాఖ కూడా ఆలయ అధికారులు, అర్చకులతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోనుందని తెలుస్తుంది .

English summary
With the closing of Lockdown 3.0, the endowment ministry is giving the green signal to visit the devotees in the temples. There is currently debate about the consequences of opening temples after the lockdown is lifted. The pilgrims have to comply with a number of rules and regulations from the time of their arrival to the temple in the corona time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X