ఏపీ డీజీపీ పదవీకాలం పొడగింపు?: మరో రెండేళ్లు పెంచేందుకు సీఎం సుముఖం!
ఏపీ డీజీపీ సాంబశివరావు పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడగించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
విజయవాడ: ఏపీ డీజీపీ సాంబశివరావు పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడగించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో ఆయన పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
త్వరలో చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సందర్భంగా డీజీపీ పదవీకాలం ముగింపు అంశం కూడా చర్చకు వచ్చింది. ఇప్పటికే పలువురు సీనియర్ అధికారులు డీజీపీ పోస్టు కోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు.

అయితే పనితీరు, సామాజికవర్గం కోణం నుంచి సాంబశివరావును కొనసాగించడమే బెటర్ అని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. డీజీపీ పదవి పొడగింపు కోరుతూ కేంద్ర హోంశాఖ, యూపీపీఎస్సీలకు ఫైల్ పంపించాలని సీఎం ఆదేశించినట్టు సమాచారం.












Click it and Unblock the Notifications