Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సబ్ కలెక్టర్ ఆఫీసులో ఏం జరిగిందో చెప్పిన డీజీపీ, బీరు బాటిల్స్, అగ్గిపుల్లలు, మైండ్ బ్లాక్

ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం సంఘటన విషయంలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు అంటున్నారు. అగ్నిప్రమాదం గురించి ఆర్డీవోకు తెలిసినా కలెక్టర్ కు చెప్పలేదు. సీఐకి తెలిసినా డీఎస్పీకి, జిల్లా ఎస్పీకి చెప్పలేదు. కార్యాలయం బయట పైళ్లు ఎందుకు కాలుతున్నాయి అనే విషయం అర్థం కావడం లేదని డీజీపీ ద్వారకా తిరుమలరావు అంటున్నారు.

సోమవారం మదనపల్లె చేరుకున్న ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు సబె కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం తీరును పరిశీలించారు. సుమారు మూడు గంటల పాటు సబ్ కలెక్టర్ కార్యాలయంలో పరిశీలించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు తరువాత అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. సాక్షాలు నాశనం కాకుండా చూడటానికి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణంలోకి ఇతరులను ఎవ్వరినీ అనుమతించలేదు.

DGP Tirumala Rao gave sensational information about Madanapalle sub collector fire accident

ఈఘటనపై ఎస్పీడీసీఎల్, ఫైర్ సిబ్బంది నుంచి ప్రాథమిక నివేదిక కోరిన డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్వయంగా ఘటనాస్థలంలో నిశితంగా పరిశీలించారు. ఇది ఫైర్ యాక్సిడెంట్‌ కాదని, ఇన్సిడెంట్‌గా అనిపిస్తోందని డీజీపీ ద్వారకా తిరుమలరావు అనుమానం వ్యక్తం చేశారు. సబ్ కలెక్టర్ ఆఫీసులో షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశమే లేదని, కిటికీ బయట అగ్గిపుల్లలు కూడా కనిపించాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని డీజీపీ అన్నారు.

మదనపల్లెలో విలేకరులతో మాట్లాడిన డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక సమాచారం వెల్లడించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో ఆదివారం రాత్రి సుమారు 11. 24 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. ఇది యాక్సిడెంట్ కాదని, ఇన్సిడెంట్ అని డీజీపీ ద్వారకా తిరుమలరావు అంటున్నారు. ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే అగ్ని ప్రమాదంగా అనిపించట్లేదని, సబ్ కలెక్టర్ ఆఫీసులో కొద్దిరోజులుగా సీసీ టీవీ కెమెరాలు పని చేయట్లేదని సిబ్బంది చెబుతున్నారని డీజీపీ ద్వారకా తిరుమలరావు మీడియాకు చెప్పారు.

ఈ ప్రమాదం గురించి సమాచారం ఆర్డీవోకు తెలిసింది కానీ, ఆయన ఎందుకో కలెక్టర్‌కు సమాచారం ఇవ్వలేదని, స్థానిక సీఐ కూడా సమాచారం తెలిసినా ఆయన కూడా జిల్లా ఎస్పీకి, మదనపల్లెలోనే ఉండే డీఎస్పీలకు సమాచారం ఇవ్వకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని డీజీపీ ద్వారక తిరుమాలరావు అన్నారు. అగ్నిప్రమాదం విషయంలో రెవెన్యూ అధికారులు, పోలీసు ఉన్నతాధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోందని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు.

సబ్ కలెక్టర్ కార్యాలయంలో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగేందుకు అవకాశమే లేదని తమ ప్రాథమిక విచారణలో తేలిందని, కేసు దర్యాప్తునకు పది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, అన్నమయ్య జిల్లా అదనపు ఎస్పీ రాజకమల్ చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నియమిస్తున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు మీడియాకు చెప్పారు. అవసరాన్ని బట్టి మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసు అగ్నిప్రమాదం కేసును సీఐడీకు బదిలీ చేసే ఆంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు.

DGP Tirumala Rao gave sensational information about Madanapalle sub collector fire accident

సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ అన్నీ ఒకచోట కాకుండా చాలా దూరంగా కాలి పడివున్న తీరు పలు అనుమానాలు కలిగిస్తోందని, సబ్ కలెక్టర్ కార్యాలయం బయట కూడా కొన్ని ఫైళ్లు కాలిపోయాయని, ఇవన్నీ పలు అనుమానాలకు దారితీస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. సబ్ కలెక్టర్ ఆఫీసులో వోల్టేజ్ తేడాలు లేవని అధికారులు చెబుతున్నారని, ఇదే విషయాన్ని ఫోరెన్సిక్‌ నిపుణులు కూడా చెప్పారని, కార్యాలయం పక్కనే బీరు బాటిళ్లు కూడా పడి ఉన్నాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు.

పోలీసు, రెవెన్యూ అధికారులు నిర్లక్షం స్పష్టంగా కనిపిస్తోందని, విచారణలో అన్ని తేలుతాయని, అన్ని వివరాలు బయటకొస్తాయని, కొన్ని ఫైల్స్ ఈ- ఆఫీసులో అందుబాటులో ఉన్నాయని, తప్పు చేసినవారు ఎవ్వరూ తప్పించుకోలేరని,కేసు సీఐడీకి బదిలీ చేసే అంశంపై ప్రభుత్వంతో చర్చలు జరిపి త్వరలో నిర్ణయం తీసుకుంటామని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు.

ఈ ఘటన యాక్సిడెంట్‌ కాదని, విచారణలో అసలు విషయం బయటకు లాగుతామని, ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని, పోలీసు శాఖ కూడా దీనిని తీవ్రంగా పరిగణిస్తోందని, ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు అందించాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు, వివరాలు గోప్యంగా ఉంటాయని, ప్రజలు, అధికారులు దర్యాప్తుకు సహకరించాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు మనవి చేశారు. మొత్తం 25 రన్నింగ్ ఫైల్స్ దగ్ధమయ్యాయని కలెక్టర్ చెబుతున్నారని అసలు ఆ కాలిపోయిన ఫైళ్లు దేనికి సంబంధించినవి అని గుర్తించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు.

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించి పలు ఆధారాలు సేకరించారు. మరో వైపు ఈ కేసులో అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్న సబ్ కలెక్టర్ కార్యాలయం ఉద్యోగి, పుంగనూరు నివాసి గౌతమ్ తేజను డీజీపీ విచారణ చేసి వివరాలు సేకరించారని తెలిసింది. అయితే గౌతమ్ తేజ నోరు విప్పాడా లేదా ? అనే విషయంలో డీజీపీ ద్వారకా తిరుమలరావు కాని, పోలీసు అధికారులు కాని వివరాలు బయటకు చెప్పలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+