ఎన్నాళ్లుంటానో: ధర్మాన ప్రసాద రావు ఆసక్తికర వ్యాఖ్య

రెండు రోజుల క్రితం శ్రీకాకుళంలోని తన నివాసంలో నియోజకవర్గానికి చెందిన సర్పంచులతో ధర్మాన భేటీ అయ్యారు. ధర్మాన కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెసు పార్టీని వీడాలనుకుంటున్నట్లుగా వారికి చెప్పినట్లుగా సమాచారం.
అందరూ సహకరించాలని, ఇక కాంగ్రెస్ పార్టీలో ఎన్ని రోజులు ఉంటానో కూడా చెప్పలేనని వారితో అన్నారట. సమైక్యాంధ్ర కోసం తన నిర్ణయాన్ని సమర్థించాలని ధర్మాన కోరగా, మెజార్టీ సర్పంచులు ఆమోదం తెలిపారట కూడా.
కాగా, ఇటీవల ధర్మాన ప్రసాద రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నెలాఖరులోగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన ఆ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యారనే వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications