జగన్ పార్టీలోకి ధర్మాన ప్రసాద రావు: వాయిదా?

ఆయన ఈ నెలాఖరులోగా పార్టీలో చేరుతారని వినిపించింది. అయితే విభజన నిర్ణయం నేపథ్యంలో డిసెంబరు రెండో వారంలో ఆయన జగన్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ నేతలతో పాటు విభజను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర నేతలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టిన రోజైన డిసెంబర్ 9 నాటికి విభజన - సమస్యలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
విభజన కారణంగా ఇప్పటికే సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ పని అయిపోయిందని సొంత పార్టీ నేతలే అంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ధర్మాన కూడా డిసెంబర్ రెండో వారం వరకు వేచి చూసి ఆ తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలని భావిస్తున్నారట. వచ్చే నెలలో శ్రీకాకుళంలో భారీ సభ నిర్వహించి కాంగ్రెసును వీడాలనుకుంటున్నారట.
శ్రీకాకుళం ఎంపీ సీటుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా బరిలో దిగేందుకు ఇప్పటికే ఆయన రంగం సిద్ధం చేసుకున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల అనుచరులతో జరిగిన ఓ భేటీలోను తాను కాంగ్రెసు పార్టీలో ఎన్నాళ్లుంటానో అని వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications