వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుద్దపల్లి క్వారీలో దూళిపాళ్ల నరేంద్ర దీక్ష; అధికారుల హామీతో విరమణ; గృహనిర్బందాలపై భగ్గుమన్న టీడీపీ

|
Google Oneindia TeluguNews

టిడిపి సీనియర్ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర సుద్దపల్లి లోని అక్రమ మైనింగ్ పై దీక్షకు దిగారు. చేబ్రోలు మండలం సుద్దపల్లిలో అక్రమ మైనింగ్ కొనసాగుతుందని, బుధవారం మధ్యాహ్నం నుంచి ధూళిపాళ్ల నరేంద్ర క్వారీ వద్ద ఆందోళన కొనసాగించారు. బుధవారం రాత్రి క్వారీ వద్దే నిద్రించిన టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర గ్రావెల్ అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. అధికారుల హామీతో దీక్ష విరమించారు.

ధూళిపాళ్ళ దీక్షకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న దేవినేని ఉమా హౌస్ అరెస్ట్

ధూళిపాళ్ళ నరేంద్ర అక్రమ మైనింగ్ పై చేస్తున్న దీక్షకు మద్దతు తెలపడం కోసం వెళ్లాలని ప్రయత్నించిన దేవినేని ఉమాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీక్షకు వెళ్లేందుకు వీలు లేదంటూ మాజీ మంత్రి దేవినేని ఉమాను భవానిపురం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఎటువంటి నోటీసులు లేకుండా హౌస్ అరెస్ట్ ఎలా చేస్తారంటూ పోలీసుల తీరుపై దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి దేవినేని ఉమ ఇంటి వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరకు తన నివాసం నుంచి పోలీసుల వలయాన్ని ఛేదించిన దేవినేని ఉమా గుంటూరులో ధూళిపాళ్ల నరేంద్ర ను కలవడం కోసం బయలుదేరారు

అక్రమ మైనింగ్ పై అధికారులు చర్య ఎందుకు తీసుకోవటం లేదన్న టీడీపీ నేత దేవినేని ఉమా

అక్రమ మైనింగ్ పై అధికారులు చర్య ఎందుకు తీసుకోవటం లేదన్న టీడీపీ నేత దేవినేని ఉమా

గుంటూరు జిల్లా శుద్ధపల్లి లో అక్రమ మైనింగ్ పై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మాజీ మంత్రి టిడిపి నేత దేవినేని ఉమ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మీ నేతల దోపిడీపై టీడీపీ నేతలపై అక్రమ కేసులు హౌస్ అరెస్టులతో ఆపలేరు అంటూ దేవినేని ఉమా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. కోట్లాది రూపాయల అక్రమ దోపిడీని ప్రశ్నిస్తూ దూళిపాళ్ల నరేంద్ర చేపట్టిన దీక్ష తాడేపల్లి రాజ ప్రసాదానికి కనిపించడం లేదా అంటూ దేవినేని ఉమా ప్రశ్నించారు .

అక్రమ మైనింగ్ పై అధికారుల హామీతో దీక్ష విరమణ


బుధవారం మధ్యాహ్నం నుండి కొనసాగుతున్న దీక్ష నేపథ్యంలో దూళిపాళ్ల నరేంద్ర తో మైనింగ్ అధికారులు మాట్లాడారు. అక్రమ మైనింగ్ పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వారు ధూళిపాళ్ల నరేంద్ర తో తెలిపారు. అధికారులతో దూళిపాళ్ల నరేంద్ర ఏ మేరకు అక్రమ మైనింగ్ జరిగిందో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ధూళిపాళ్ల నరేంద్ర దీక్ష నేపథ్యంలో మైనింగ్ అధికారులు రంగంలోకి దిగి క్వారీని పరిశీలించారు. క్వారీలో కొలతలు తీసి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో దూళిపాళ్ల నరేంద్ర ఆందోళన విరమించినట్లు తెలిపారు.

Recommended Video

PM Modi పై Ponnala Lakshmaiah ఫైర్ | Oneindia Telugu
అధికార బలంతో అడ్డగోలుగా అక్రమ మైనింగ్ చేస్తున్నారన్న ధూళిపాళ్ళ

అధికార బలంతో అడ్డగోలుగా అక్రమ మైనింగ్ చేస్తున్నారన్న ధూళిపాళ్ళ

ఇక ఇదే సమయంలో తన దీక్షకు మద్దతు తెలపడానికి వస్తున్న టిడిపి నేతలను హౌస్ అరెస్టు చేయడంపై ధూళిపాళ్ళ నరేంద్ర మండిపడ్డారు. ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అధికార బలంతో అడ్డగోలుగా మైనింగ్ చేశారంటూ ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అందుకే ఆందోళనకు దిగవలసి వచ్చిందని ఆయన తెలిపారు. సుద్దపల్లిలో అక్రమ మైనింగ్ చేయవద్దని స్థానికులు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అక్రమ మైనింగ్ పై అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చారని స్థానికులతో కలిసి కమిటీలు వేసి, మైనింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారని ధూళిపాళ్ళ నరేంద్ర వెల్లడించారు. అక్రమ అరెస్టును ఖండిస్తున్నాను అని ప్రతిపక్షాల ప్రజల తరఫున పోరాటం చేసి తీరుతాయని ధూళిపాళ్ల నరేంద్ర చెప్పుకొచ్చారు.

English summary
TDP senior leader Dhulippalla Narendra staged a protest over Suddapalli illegal mining. Police house arrested devineni uma who is ready to support narendra deeksha. Narendra has stooped his protest with the assurance of the authorities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X