టీడీపీలో భగ్గుమన్న విభేదాలు..?
గెలిచి రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే టీడీపీ నేతల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ నేతల మధ్య అధిపత్య పోరు మొదలైందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలో మంత్రి, సీనియర్ ఎమ్మెల్యేల మధ్య దూరం పెరిగిందనే వార్తలొస్తున్నాయి. జిల్లా మంత్రి , సీనియర్ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర అధిపత్యపోరు నడుస్తోందని చర్చించుకుంటున్నారు. మంత్రి వాసంశెట్టి సుభాష్‌పై నాయకులు , పార్టీ క్యాడర్ గుర్రుగా ఉన్నట్టు సమాచారం. టీడీపీ సీనియర్ నాయకులెవ్వరూ కూడా ఆయనతో సమావేశం కావడానికి పెద్దగా సుముఖత వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది.
వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వాసంశెట్టి సుభాష్ టికెట్ దక్కించుకోవడంతో పాటు, ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి కూడా అయ్యారు. దీంతో టీడీపీలో మొదటి నుంచి నాయకులు ఆయనపై అక్కస్సు వెళ్లగక్కుతున్నారు. మాజీ మంత్రి జవహర్, రెడ్డి అనంతలక్షి, జ్యోతుల నెహ్రూ ఇలా టీడీపీ నేతలందరూ కూడా వాసంశెట్టి సుభాష్ తీరుపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా అనంతపురం జిల్లాలో కూడా నేతల మధ్య విభేదాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ.అస్మిత్ రెడ్డి , మడకశిర నియోజకవర్గ ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజుల మధ్య అధిపత్యపోరు నడుస్తోన్నట్టు సమాచారం అందుతోంది.

తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ.అస్మిత్ రెడ్డి అభిమాన ఫేస్ బుక్ పేజ్‌లో ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. గౌరవనీయులైన MS రాజు అన్నా మీరు దయచేసి తాడిపత్రి విషయాలలో జోక్యం చేసుకోకండి, మీరు గతంలో తాడిపత్రి SDPO పని చెసిన వారిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు గా అనిపిస్తుంది, తాడిపత్రి మేము పడిన బాధలు,అవమానాలు మాకు మాత్రమే తెలుసు దయచేసి మా తాడిపత్రి విషయంలో జోక్యం చేసుకోకండి, ఇది మా రిక్వెస్ట్ అన్నా, ఇది అందరు నాయకులకు కూడా వర్తిస్తుంది అని చెబుతూ జేసీ.అస్మిత్ రెడ్డి ఆర్మీ పేరు మీద ఉన్న ఫేస్ బుక్ పేజ్‌లో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
మడకశిర నియోజకవర్గ ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, తాడిపత్రి నియోజకవర్గంలో కలుగజేసుకోవడం వల్లే వీరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నట్టు ఈ పోస్ట్ చూస్తే స్పష్టం అవుతోంది. అయితే దీనిపై అటు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ.అస్మిత్ రెడ్డి కానీ ఇటు మడకశిర నియోజకవర్గ ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు కానీ ఎవరూ స్పందించలేదు. గెలిచి రెండు నెలలు కాకుండానే ఇలా నేతల మధ్య పోరు మొదలుకావడంతో క్యాడర్ తలలు పట్టుకుంటున్నారు.
-
Amaravati: అమరావతి గెజిట్ నోటిఫికేషన్ విడుదల -
పంచాయతీ కార్యదర్శులకు చంద్రబాబు షాక్-తాజా ఉత్తర్వులు..! -
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం దెబ్బ ఏపీ రోడ్లకు.. ఎలాగంటే -
ఏపీలోకి తమిళనాడు, పుదుచ్చేరి బోట్లు-చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
మావిగన్ పై స్పందన చూసి చంద్రబాబుకు వణుకుపుడుతోంది! -
సీ షోర్ హైవేపై కేంద్రానికి ప్రతిపాదన పంపిన చంద్రబాబు.. ప్లాన్ ఇదే! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన!










Click it and Unblock the Notifications