కాలం చెల్లిన నేత‌లు'' కేవీపీని ఘెరంగా అవమానించిన షర్మిల..?

ఏపీలో కాంగ్రెస్ పార్టీని వైఎస్ షర్మిల సర్వ నాశనం చేస్తోందని ఆ పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కూడా ఆమె మొండిగానే వ్యవహరిస్తున్నారని నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. పార్టీలో సీనియర్ నాయకులకు షర్మిల గౌరవం ఇవ్వడం లేదని, పార్టీలో దేని గురించి కూడా ఆమె ఎవరితోనూ చర్చించరని సీనియర్ నాయకులు వాపోతున్నారు. షర్మిల తన సొంత నిర్ణయాలను పార్టీపై రుద్దే ప్రయత్నం జరుగుతుందని ఆరోపిస్తున్నారు.

ఒంటెద్దు పోకడలతో పార్టీని ఇబ్బందికి గురి చేస్తోందని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ ఫ్యామిలీకి విధేయుడు కేవీపీ రామ‌చంద్ర‌రావు కూడా షర్మిల తీరుపై అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇదే సమయంలో కేవీపీ రామ‌చంద్ర‌రావును షర్మిల ఘోరంగా అవమానించారని సమాచారం. ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయని తెలుస్తోంది. ఇద్దరి మధ్య వివాదాలు ముదరడంతో కేవీపీ సైలెంట్ అయ్యారనే గుస గుసలు పార్టీలో వినిపిస్తున్నాయి. ష‌ర్మిల ,కేవీపీల మ‌ధ్య వివాదం రావ‌డానికి ఆమె సొంత అజెండాను అమ‌లు చేయ‌డ‌మేన‌ని తెలుస్తోంది. ఎన్నిక‌ల‌కు ముందు.. త‌ర్వాత కూడా.. ష‌ర్మిల సొంత అజెండాను అమ‌లు చేయ‌డాన్ని సీనియ‌ర్ నేతలు తప్పుపడుతున్నారు.

Differences between Sharmila KVP Ramachandra Rao

ముఖ్యంగా జ‌గ‌న్‌ను ఏక‌ప‌క్షంగా విమ‌ర్శిస్తే.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెరగదని కేవీపీ చెప్పినప్పటికీ ఆయన మాట వినకుండా జగన్ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారంట. వ్య‌క్తిగ‌త క‌క్ష‌ల‌కు కాంగ్రెస్‌ను వాడుకోవ‌ద్ద‌ని చెప్పడంతోనే షర్మిల కేవీపీని దూరం పెట్టినట్టు తెలుస్తోంది. కాలం చెల్లిన నేత‌లు.. క‌బుర్లు చెబుతున్నారు అంటూ.. పార్టీ స‌మావేశంలోనే కేవీపీపై విరుచుకుప‌డ్డార‌ట షర్మిల.షర్మిల మాటలకు నొచ్చుకున్న కేవీపీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.

అధిష్టానంతో స‌త్సంబంధాలు ఉన్నప్పటికీ వైఎస్ కుటుంబం మీద ఉన్న గౌరవంతో షర్మిల మీద ఎటువంటి ఫిర్యాదులు చేయకుండా కేవీపీ మౌనం పాటిస్తున్నారని ఆ పార్టీ నాయకలు చర్చించుకుంటున్నారు. వైఎస్‌కు న‌మ్మిన బంటుగా గుర్తింపు తెచ్చుకున్న కేవీపీపైనే షర్మిల ఇంత దారుణంగా మాట్లాడటం సరికాదని కాంగ్రెస్ నేతల వాదన.ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా షర్మిల జగన్‌ను విమర్శించడం దారుణమని, ఎవరైనా అధికార పార్టీని టార్గెట్ చేయాలనుకుంటారు కానీ, విచిత్రంగా షర్మిల జగన్‌ను టార్గెట్ చేస్తున్నారని, దీనిపై ప్రశ్నిస్తే, పార్టీ నుంచి వెళ్లిపోయినా బాధలేదన్నట్టుగా ఆమె వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే చాలామంది సీనియర్ నేతలు పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయనే చర్చ ఏపీ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. మరి షర్మిల దూకుడుకు కాంగ్రెస్ అధిష్టానం ఎలా కళ్లెం వేస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+