టచ్‌లో అధిష్టానం: కిరణ్‌కు డిగ్గీ కితాబు దేనికి సంకేతం?
హైదరాబాద్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. కిరణ్ మొదటి నుండి విభజనను వ్యతిరేకిస్తున్నారు. కిరణ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వ్యతిరేకించినప్పుడుల్లా డిగ్గీ స్పందించి... కిరణ్ పార్టీకి లాయల్‌గా ఉంటారని, ఆయన అభిప్రాయం చెప్పడంలో తప్పులేదని చెప్పేవారు.
ఇప్పుడు కిరణ్ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. కొత్త పార్టీపై కసరత్తు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కూడా డిగ్గీ ఆయనపై మెతకవైఖరితో మాట్లాడటం గమనార్హం. డిగ్గీ వ్యాఖ్యలు చూస్తుంటే కిరణ్ తిరిగి కాంగ్రెసు పార్టీలోకే వెళ్తారనే వాదన తెర పైకి వచ్చింది. గతంలో పలువురు సీమాంధ్ర నేతలు ఇదే చెప్పారు. కిరణ్ పార్టీ వీడినా, కొత్త పార్టీ పెట్టినా తిరిగి కాంగ్రెసులోనే కలుస్తారని వ్యాఖ్యానించారు. మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ అయితే.. కిరణ్ కాంగ్రెసులోకి వచ్చి ఏఐసిసి నేతగా రాష్ట్రానికి వస్తారని ఎద్దేవా చేశారు.

సోమవారం డిగ్గీ ఢిల్లీలో సీమాంధ్ర నేతల భేటీలో మాట్లాడుతూ... పార్టీని వీడిన వారంతా తిరిగి రావాలని పిలుపునిచ్చారు. విభజన జరిగినందున కాంగ్రెసు నుండి వెళ్లిపోయిన వారు తిరిగి రావాలన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి పార్టీని వీడటం దురదృష్టకరమన్నారు. కిరణ్ కుమార్ విభజనకు మాత్రమే వ్యతిరేకమని, ఆయన ఎప్పుడు కూడా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని కితాబిచ్చారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆయన బాగా పని చేశారన్నారు. కాగా, అధిష్టానం పెద్దలు కిరణ్ కుమార్ రెడ్డితో ఇప్పటికీ టచ్‌లో ఉన్నారట. కిరణ్‌కు కేంద్రమంత్రి పళ్లం రాజు క్లోజ్ ఫ్రెండ్. ఆయన ద్వారా టచ్‌లో ఉన్నారట.












Click it and Unblock the Notifications