5లోగా చెప్పండి: టిపై డిగ్గీ డెడ్‌లైన్, ఆపలేరని దామోదర

న్యూఢిల్లీ/హైదరాబాద్: సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నాయకులు నవంబర్ 5వ తేదీ లోపు విభజనపై తమ అభిప్రాయాలను మంత్రుల బృందానికి (జివోఎం)కు తెలపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ మంగళవారం సూచించారు.

సీమాంధ్ర ప్రజలకు కచ్చితంగా న్యాయం చేస్తామని తెలిపారు. వారికి అన్యాయం జరగదన్నారు. విభజన అంశంపై మంత్రుల బృందం కసరత్తు చేస్తోందన్నారు. ఇరు ప్రాంతాల వారి అభిప్రాయాల ద్వారా స్పష్టత వస్తుందని, వాటి ఆధారంగా ముందుకు వెళ్తామని డిగ్గీ చెప్పారు.

Digvijay Singh deadline to state leaders

ఎవరు ఆపలేరు: దామోదర

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరు అపలేరని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వేరుగా మహబూబ్ నగర్ జిల్లాలో అన్నారు. తెలంగాణ సునామీలో ఎవరైనా కొట్టుకు పోవాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. సమైక్య రాష్ట్రంలో పాలమూరు జిల్లా ఎక్కువగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

హోంశాఖ ఉన్నతస్థాయి బృందం భేటీ

హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణా సంస్థకు చెందిన పరిపాలన భవనంలో హోంశాఖ ఉన్నతస్థాయి బృందం సమావేశమైంది. ఉన్నతాధికారులు, మాజీ డిజిపిలతో ఉన్నతస్థాయి బృందం వివిధ అంశాలపై చర్చిస్తోంది.

ఈ భేటీలో విజయ్ కుమార్, రాజీవ్ వర్మ, సంతోష్ మెహ్రా, ఎకె ఖాన్, అజయ్ మిశ్రా, దామోదర్, జెవి రాముడు, మిత్రా, సజ్జనార్, అరవింద్ రావు, పూనం మాలకొండయ్య, అనురాగ్ శర్మలు పాల్గొన్నారు. ప్రసాద రావు, హెచ్‌జె దొర, మహంతి, ఆంజనేయులులు పాల్గొనలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+