వెంకయ్య స్పందించాలి, చంద్రబాబు ఎందుకు సిగ్గుపడుతున్నారు: డిగ్గీ రాజా

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా అంశాన్ని ఇతర రాష్ట్రాలతో ముడిపెట్టొద్దని కేవీపీ బిల్లు రాజ్యసభలో చర్చకు వచ్చిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఏపీ పునర్ వ్వవస్థీకరణ చట్టం, హమీల అమలపై రాజ్యసభలో గురువారం సాయంత్రం చర్చించారు.

ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ ప్రధాని హామీ ఇస్తే, దానిని అమలు చేయాల్సిన బాధ్యత ఉందా? లేదా? అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు అప్పటి ప్రధానమంత్రి అభ్యర్ధి ఏపీలో నిర్వహించిన ఓ భారీ బహిరంగ సభలో ఏపీని అన్ని విధాలా ఆదుకుంటామని, ఆర్ధిక లోటు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు.

Digvijay singh on kvp private member bill in rajya sabha

మరోవైపు రాజ్యసభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లు ప్రత్యేకహోదా కావాలని అడిగిన వెంకయ్య నాయుడు ఆ హామీపై ఇంకా నిలబడ్డారా? లేదా? అన్నది స్పష్టం చేయాలని అన్నారు. హైదరాబాదు చుట్టూ ఆదాయ వనరులు ఏర్పాటు చేయడం వల్ల ఏపీ పూర్తిగా నష్టపోయిందని ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోసం ప్రధానమంత్రిపై చంద్రబాబు ఎందుకు ఒత్తిడి తీసుకు రావడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారో తనకు తెలియదన్నారు. ప్రధాని ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ఎందుకు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేయలేకపోతున్నారో తనకు తెలియదని ఆయన చెప్పారు.

ఆయన అలా చేయకపోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా? లేక వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా? అని ఆయన డిగ్గీరాజా నిలదీశారు.

ప్రధాని ఇచ్చిన హామీని నెరవేర్చాలి: రాజా

పార్టీలు అధికారంలో ఉంటాయి, అధికారం కోల్పోతాయి... కానీ ప్రభుత్వం మాత్రం ఉంటుందని వామపక్ష నేత సభ్యుడు డీ రాజా తెలిపారు. ప్రధాని ఇచ్చిన హమీని నెరవేర్చాలని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదాపై బీజేపీ నిర్ణయం ఏంటని ఆయన ప్రశ్నించారు.

ఏపీకి ప్రత్యేకహోదా బీజేపీ ఎందుకు నోరు ఇప్పడం లేదని ఆయన మండిపడ్డారు. ఏపీకి ఎలా న్యాయం చేయాలనుకుంటున్నారన్న విషయంపై బీజేపీ ఇప్పటి వరకు నోరిప్పలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదాపై బీజేపీ వైఖరి ఏంటన్నది బీజేపీ స్పష్టం చేశాయని ఆయన సూచించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress leader Digvijay singh on kvp private member bill in rajya sabha.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి