ఏమౌతుంది: లేఖపై ముఖ్యమంత్రికి ఫోన్ చేసి డిగ్గీ ఆరా
హైదరాబాద్/న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం ఏకపక్షంగా ముందుకు వెళ్లడంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌లకు లేఖ రాయడంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ ఆరా తీశారు.
డిగ్గీ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఈ విషయమై అడిగారు. శనివారం రాత్రి ఫోన్ చేసిన దిగ్విజయ్ దానిపై అడగగా ముఖ్యమంత్రి స్పందించారు.

రాష్ట్ర విభజనపై అధిష్టానం తమకు ఇచ్చిన నోట్‌లో అసెంబ్లీ అభిప్రాయం రెండుసార్లు కోరుతామని పేర్కొన్నారని, ఒకసారి తీర్మానం వస్తుందని, మరోసారి బిల్లు వస్తుందని చెప్పారని, ఇదే విషయాన్ని తనకు మౌఖికంగా చెప్పారని డిగ్గీకి కిరణ్ గుర్తు చేశారు.
రాష్ట్ర విభజన విషయంలో ఇప్పటి వరకు ఉన్న ఈ విధానాన్ని కొనసాగించాలని తాను తన లేఖలలో ప్రస్తావించానని ముఖ్యమంత్రి వివరించారట.
దీంతో విభజన తీర్మానాన్ని శాసన సభకు పంపిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయని ముఖ్యమంత్రి నుండి దిగ్విజయ్ ఆరా తీశారట.












Click it and Unblock the Notifications