ఢిల్లీ టూర్ సస్పెన్స్: బాబుకు టైమివ్వని రాష్ట్రపతి, పిఎం

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ యాత్ర సందిగ్ధంలో పడింది. ఆయనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌లు సమయం ఇవ్వలేదు. దీంతో ఈ నెల 20, 21న తలపెట్టిన ఢిల్లీ యాత్ర అనిశ్చితిలో పడింది.

రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, జగన్ పైన అక్రమాస్తుల కేసు, ఆర్థిక వ్యవస్థ పతనం గురించి రాష్ట్రపతి, ప్రధాని, ప్రతిపక్ష నాయకులు, దర్యాఫ్తు సంస్థలను కలిసేందుకు చంద్రబాబు, ఇరు ప్రాంతాల పార్టీ నేతలు ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే బాబుకు రాష్ట్రపతి, ప్రధానిలు ఇంకా అపాయింటుమెంట్ ఇవ్వలేదు.

ఏ ఆధారాలతో షర్మిల చెబుతున్నారు: టిడిపి ఎంపీలు

ఏ ఆధారాలతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల తన సోదరుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వస్తుందని చెబుతున్నారో చెప్పాలని తెలుగుదేశం పార్టీ ఎంపీలు న్యూఢిల్లీలో ప్రశ్నించారు. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కుమ్మక్కై జగన్ అక్రమాస్తుల కేసును నీరుగారుస్తున్నాయని వారు ఆరోపించారు.

మంగళవారం ఉదయం జగన్ అక్రమాస్తుల కేసును వేగవంతం చేయాలని కోరుతూ సివిసి, దర్యాఫ్తు సంస్థలను వారు కలిశారు. అనంతరం నామా నాగేశ్వర రావు, కొణకళ్ల, రమేష్ రాథోడ్, సిఎం రమేష్‌లు మీడియాతో మాట్లాడుతూ ఆరు దేశాల్లో మనీ ల్యాండరింగ్ జరిగినట్లు రుజువైందని, అయినా ఈడి సరిగా దర్యాప్తు జరపడం లేదని మండిపడ్డారు. రూ.45 కోట్లు అవనీతి జరిగినట్లు నిర్థారణ అయితే రూ.270 కోట్ల ఆస్తులను మాత్రమే జప్తు చేశారని టిడిపి ఎంపీలు విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+