Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎమ్మెల్యే కోటంరెడ్డి వినూత్న కార్యక్రమం.. నెల రోజుల్లో 1000 మంది కార్యకర్తలతో వన్ టూ వన్ టాక్

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరో వినూత్న కార్యక్రమం చేపట్టారు. నెల రోజుల్లో వెయ్యి మంది కార్యకర్తలు నాయకులతో వన్ టూ వన్ టాక్ నిర్వహించారు. కార్యకర్తల కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు ప్రశంసలు దక్కుతున్నాయి. కోటంరెడ్డి స్ఫూర్తితో మిగతా ఎమ్మెల్యేలు సైతం ఆయన బాటలోనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధం అవుతున్నారు.

సాధారణంగా ఎన్నికల సమయంలో మాత్రమే ఎమ్మెల్యేలు తమ కార్యకర్తలు, నాయకులతో అభిప్రాయ సేకరణ చేస్తూ ఉంటారు. కానీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా ఇటీవల ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.


ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేని సమయంలో, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. గడచిన మూడు రోజులుగా, రోజుకు దాదాపు నలభై మంది కార్యకర్తలు, నాయకులతో వన్ టూ వన్ గా మాట్లాడుతున్నారు. ఒక్కో కార్యకర్తతో పది నుండి పదిహేను నిమిషాల పాటు వ్యక్తిగతంగా మాట్లాడుతుండటం విశేషంగా చెప్పొచ్చు.

నెల్లూరు రూరల్ ​ఎమ్మెల్యే కార్యాలయం పనితీరుపై, ఎమ్మెల్యేగా తన పనితీరుపై లేదా ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి పనితీరుపై లేదా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇతర నాయకుల పనితీరుపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే నేరుగా తనతో చెప్పమని ఈ సందర్బంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కోరుతున్నారు. అంతేకాదు, స్థానిక సమస్యల పరిష్కారంలో అధికారుల తీరుతెన్నులపై కూడా వివరంగా ఆరా తీస్తున్నారు.

ఈ వన్-టూ-వన్ సమావేశాల్లో కేవలం రాజకీయ సమస్యలే కాక, ప్రతి కార్యకర్త కుటుంబ ఆర్థిక స్థితి, జీవనోపాధి, వారి పిల్లల చదువుల గురించి కూడా ఆయన అడిగి తెలుసుకుంటున్నారు. అవసరమైన చోట తగిన సహాయం కూడా చేస్తున్నట్టు సమాచారం.

Direct Dialogue Drive Nellore MLA Kotamreddy s Bold Plan for One-on-One Talks with 1000 Activists

"ఏ ఎన్నికలు లేని సమయంలో మా కష్టసుఖాలు అడిగి తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి తగిన సలహా ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం మా అదృష్టం" అని కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు 30 రోజులపాటు కొనసాగనున్న ఈ కార్యక్రమంలో, దాదాపు వెయ్యి మంది కార్యకర్తలతో మాట్లాడాలన్నది ఎమ్మెల్యే ప్రణాళిక.

ఈ నెల 18వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో, ఒక వారం విరామం తీసుకుని తిరిగి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారని ఎమ్మెల్యే కార్యాలయం నుండి సమాచారం. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేపట్టిన ఈ పర్సనల్ టాక్ విత్ వన్-టూ-వన్ కార్యక్రమం, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోందని నెల్లూరు రూరల్ ప్రజానీకంలో హాట్ టాపిక్ గా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+